అన్నను తాళ్ళతో కట్టేసి .. నాగర్ కర్నూలులో తమ్ముడి పైశాచికం
02-05-202002-05-2020 11:22:45 IST
Updated On 02-05-2020 12:15:44 ISTUpdated On 02-05-20202020-05-02T05:52:45.182Z02-05-2020 2020-05-02T05:52:34.050Z - 2020-05-02T06:45:44.228Z - 02-05-2020

అనుబంధం ఆప్యాయత అనేవి ఈరోజుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. అన్న, తమ్ముడు, భార్య, భర్త, స్నేహితుడు, తండ్రీ కొడుకు.. ఎవరూ ఎవరికీ విలువ ఇవ్వడం లేదు. క్షణికావేశం, ఆస్తిపై వ్యామోహం, వివాహేతర సంబంధాలు, వ్యక్తిగత గొడవలతో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. తెలంగాణలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం తూడుకుర్తి లో అన్నదమ్ముల మధ్య వివాదం హత్యాయత్నానికి దారితీసింది. క్షణికావేశానికి గురైన తమ్ముడు అన్నను తాళ్లతో కట్టేసి తన కుటుంబ సభ్యులతో కలిసి విచక్షణారహితంగా చితకబాదాడు. అన్నను తాళ్ళతో కట్టి కటిక నేలమీద పొలంలో ఈడ్చుకుంటూ పోయి చంపేందుకు ప్రయత్నించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. లబాధితుడు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తనకు జరిగిన అన్యాయం, తమ్ముడి పైశాచికత్వం గురించి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తూడుకుర్తి కి చెందిన తిరుపతయ్య అన్నయ్య కాగా, కురుమయ్య తమ్ముడు. ఈ రెండు కుటుంబాల మధ్య భూ వివాదాలు ఉన్నాయి. అన్నకు 20 గుంటల భూమి ఎక్కువగా ఉందని కోపం పెంచుకున్నాడు తమ్ముడు. పలు పర్యాయాలు గ్రామంలో పంచాయతీ కూడా పెట్టారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో కక్ష పెంచుకున్న తమ్ముడు గత నెల 29వ తేదీ ఉదయం పొలం వద్ద ట్రాక్టర్ తో దున్నుతున్న అన్నను తన కుటుంబ సభ్యులతో కలిసి చితకబాదాడు. కోపం చల్లారకపోవడంతో తాళ్లతో కట్టేసి చెట్టుకు కట్టి విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పొలంలో ఈడ్చుకుంటూ వెళ్లి ఉరి వేసే ప్రయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు వచ్చి తిరుతయ్యను కాపాడే ప్రయత్నం చేయడంతో కురుమయ్య అన్నను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనపై గ్రామంలో పంచాయితీ పెట్టి మాట్లాడారు. న్యాయం జరగకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధితుడు తిరుపతయ్య నాగర్ కర్నూలు ఎస్ఐ తిరుపతయ్యకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
32 minutes ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
2 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
3 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
5 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
5 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
6 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
4 hours ago

నా రూటే సెపరేటు
8 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
21 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా