newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

అన్నంత ప‌ని చేసిన ఎంపీ బండి సంజ‌య్‌

08-11-201908-11-2019 12:30:11 IST
2019-11-08T07:00:11.020Z08-11-2019 2019-11-08T07:00:09.401Z - - 22-02-2020

అన్నంత ప‌ని చేసిన ఎంపీ బండి సంజ‌య్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రీంన‌గర్ ఎంపీ బండి సంజ‌య్ అన్నంత ప‌ని చేశారు. త‌నపై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన జిల్లా పోలీసుల‌పై పోరాటానికి దిగారు. పార్ల‌మెంటు స‌భ్యుడిగా త‌న హ‌క్కుల‌ను ఉప‌యోగించుకుంటూ పోలీసుల‌పై విచార‌ణ‌కు ఆదేశించేలా చేశారు.

ఒకేసారి లోక్‌స‌భ స్పీక‌ర్, జాతీయ మానవ హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించి జిల్లా పోలీసుల ప్ర‌వ‌ర్త‌నపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల‌కు తిప్ప‌లు త‌ప్పేలా లేవు.

క‌రీంన‌గ‌ర్ న‌గ‌రంలోని ఆరేప‌ల్లిలో ఆర్టీసీ కండ‌క్ట‌ర్ బాబు అంతిమ‌యాత్ర‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. అంతిమ‌యాత్ర‌ను ఆర్టీసీ డిపోకు తీసుకెళ్లాల‌ని కుటుంబ‌స‌భ్యులు, తోటి కార్మికులు నిర్ణ‌యించారు.

వీరికి ఎంపీ బండి సంజ‌య్ మ‌ద్ద‌తిచ్చారు. అంతిమ‌యాత్ర‌తో పాటే న‌డిచారు. ఈ స‌మ‌యంలో డిపోకు అంతిమ‌యాత్ర వెళితే ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు భావించారు.

అంతిమ‌యాత్ర‌లోనే నేత‌ల‌ను అడ్డుకొని మృత‌దేహాన్ని దారి మ‌ళ్లించి స్మ‌శాన‌వాటిక‌కు తీసుకెళ్లారు. ఈ స‌మ‌యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసుల‌ను అడ్డుకున్న బండి సంజ‌య్‌పై కొంద‌రు పోలీసు ఉన్న‌తాధికారులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. సంజ‌య్‌పై చేయి చేసుకున్న‌ట్లు ఉన్న వీడియో, ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌పై సంజ‌య్ సీరియ‌స్‌గా స్పందించారు.

ఎంపీగా ఉన్న త‌న‌పై దాడి చేసిన పోలీసులపై స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేస్తాన‌ని సంజ‌య్ అప్పుడే చెప్పారు. అన్న‌ట్లుగానే ఆయ‌న స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి జ‌రిగిన ఘ‌ట‌న గురించి వివ‌రించి ఫిర్యాదు చేశారు.

పోలీసుల తీరుపై ప్రివిలేజ్ మోష‌న్‌కు అనుమ‌తించాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. దీంతో స్పీక‌ర్ వెంట‌నే స్పందించి ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్రివిలేజ్ క‌మిటీ ఛైర్మ‌న్‌కు స్పీక‌ర్ సూచించారు.

మ‌రోవైపు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు కూడా బండి సంజ‌య్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్‌హెచ్ఆర్‌సీ కేసు న‌మోదు చేసి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, హోం సెక్ర‌ట‌రీ, డీజీపీ, కరీంన‌గ‌ర్ సీపీ, దాడి చేసిన పోలీస్ అధికారుల‌ను ప్ర‌తివాదులుగా చేర్చారు.

ఇదిలా ఉండ‌గా జ‌రిగిన సంఘ‌ట‌న‌పై రాష్ట్ర డీజీపీ కూడా విచార‌ణ‌కు ఆదేశించారు. ప్ర‌త్యేకంగా విచార‌ణ క‌మిటీ ఏర్పాటు చేయ్య‌డంతో శుక్ర‌వారం ఆరేప‌ల్లిలో ప‌ర్య‌టించి ప్ర‌త్య‌క్ష సాక్షుల స్టేట్‌మెంట్ల‌ను రికార్డు చేసింది. ఇలా మూడు వైపుల నుంచి బండి సంజ‌య్‌పై దాడి చేసిన పోలీసుల‌పై క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

బండి సంజ‌య్‌పై నిజంగానే దాడి జ‌రిగింద‌ని తేలితే మాత్రం దాడికి పాల్ప‌డ్డ పోలీసు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. బండి సంజ‌య్ ఎంపీ హోదాలో ఉండ‌టం, అందునా అధికార పార్టీ ఎంపీ కావ‌డంతో క‌చ్చితంగా సీరియ‌స్ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. బీజేపీ అధిష్ఠానం కూడా ఈ వ్య‌వ‌హారంపై సీరియ‌స్‌గానే ఉంది.

 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle