newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అధికార లాంఛనాలతో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు

17-06-202017-06-2020 12:45:29 IST
Updated On 17-06-2020 14:40:32 ISTUpdated On 17-06-20202020-06-17T07:15:29.399Z17-06-2020 2020-06-17T07:15:06.501Z - 2020-06-17T09:10:32.774Z - 17-06-2020

 అధికార లాంఛనాలతో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌త్ చైనా స‌రిహ‌ద్దుల‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన తెలంగాణ ముద్దుబిడ్డ క‌ల్న‌ల్ సంతోష్ బాబు అంత్య‌క్రియ‌లు అధికార‌లాంచ‌నాల‌తో నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. సంతోష్ బాబు అంతిమ‌యాత్ర ఏర్పాట్ల‌తో పాటు వారి కుటుంబానికి అన్ని విధాల వెన్నంటి ఉండి అన్ని ప‌నులు స‌క్ర‌మంగా చేయాల‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డిని కోరారు.. దీంతో జ‌గ‌దీష్ రెడ్డి గ‌త రాత్రి నుంచి హైద‌రాబాద్ లో ఉంటున్న సంతోష్ త‌ల్లిదండ్రుల‌ను ప‌రామ‌ర్శించారు. తండ్రి కల నెరవేర్చడం కోసం సంతోష్ ఆర్మీలో చేరి దేశానికి అంకితం అయ్యాడని పలువురు సంతోష్ త్యాగాన్ని కొనియాడారు. 

సంతోష్ బాబు స్వగ్రామ‌మైన సూర్యాపేట జిల్లా కాసరాబాదలోని స్వంత భూమిలో సంతోష్ అంత్యక్రియలు నిర్వహిస్తామ‌ని కుటుంబ స‌భ్యులు తెలపడంతో అక్క‌డ‌కు చేరుకుని ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఢిల్లీలో ఉంటున్న సంతోష్ భార్య‌, పిల్ల‌లు విమానంలో హైద‌రాబాద్  చేరుకున్నారు. విమానాశ్ర‌యంలో సైబ‌ర్ బాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ స్వ‌యంగా వారిని చేరుకుని ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కాన్వాయిలో వారిని కాస‌రాబాదకు త‌ర‌లించారు. సంతోష్ భౌతిక కాయం క‌శ్మీర్ నుంచి హైద‌రాబాద్ కు ప్రత్యేక విమానంలో ఆర్మీ అధికారులు తరలించనున్నారు. హైదరాబాద్ చేరుకున్నాక అక్క‌డి నుంచి అధికార లాంచ‌నాల‌తో ఆర్మి అధికారులు కాస‌రాబాద్ కు త‌ర‌లించానున్నారు. అంత్య‌క్రియలు జరిగే గ్రామంలో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

క‌రోనా వైరస్ నేప‌థ్యంలో అంత్య‌క్రియ‌ల‌కు వ‌చ్చేవారిని థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయ‌నున్నారు. భౌతిక దూరం ఉండేలా గ్రామంలో బారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు సంతోష్ బాబు త్యాగానికి వెల‌క‌ట్ట‌వద్దని కుటుంబసభ్యులు కోరారు. క‌ల్న‌ల్ సంతోష్ వీర‌మ‌ర‌ణం త‌ర్వాత వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు త‌మ వంతుగా ఆర్ధిక సాయం ప్ర‌క‌టిస్తున్నారు.. ఎన్నారైల విరాళాల సేక‌ర‌ణ‌కు ఆర్యవైశ్య సంఘం ప్రయత్నించడంపై కుటుంబ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం చెప్పారు. విరాళాల సేకరణ వద్దన్నారు. తన కొడుకు త్యాగానికి విరాళాలతో వెలకట్టడం సరికాదన్నారు 

కల్నల్ సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు.సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కూడా సంతోష్ బాబు మృతికి సంతాపం తెలిపారు.దేశసరిహద్దుల్లో అసువులు బాసిన భారతమాత ముద్దు బిడ్డలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   19 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   a day ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle