newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

అధికారులకు హైకోర్ట్ షాక్.. రెండునెలల జైలుశిక్ష

20-08-201920-08-2019 13:13:06 IST
2019-08-20T07:43:06.869Z20-08-2019 2019-08-20T07:42:57.763Z - - 20-09-2019

అధికారులకు హైకోర్ట్ షాక్.. రెండునెలల జైలుశిక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు హైకోర్టు షాకిచ్చింది. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన గజ్వేల్‌ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, తొగుట తహసీల్దార్‌ ప్రభుకు 2నెలల జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా, విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ తీర్పు నిచ్చింది.

గతంలో తమకు న్యాయం చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని, అయినా అధికారులు న్యాయం చేయలేదని మల్లన్నసాగర్ నిర్వాసితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సిద్దిపేట జిల్లా తోగుట్ట ఆర్డీవో విజయేందర్ రెడ్డి, తహశీల్దార్‌ ప్రభులకు హైకోర్టు ఈ శిక్ష విధించింది.

మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి యుద్దప్రాతిపదికన వారికి పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్ గతంలో అధికారులను ఆదేశించినా.. ఇంకా పరిహారం అందని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజా తీర్పుతో సాయం కోసం చూస్తున్న నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle