newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

అదంతా కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనా?

29-01-202029-01-2020 07:56:22 IST
Updated On 29-01-2020 11:49:29 ISTUpdated On 29-01-20202020-01-29T02:26:22.460Z29-01-2020 2020-01-29T02:26:15.386Z - 2020-01-29T06:19:29.840Z - 29-01-2020

అదంతా కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్రాభ‌వం వేగంగా త‌గ్గిపోతోంది. ఎన్నికలు ఏవైనా ఓడిపోవ‌డం మాత్రం కాంగ్రెస్ వంతు అవుతుంది. ఒక‌ప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బ‌లమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని జిల్లాల‌కే ప‌రిమిత‌మైంది. ఉత్త‌ర తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికి రోజు రోజుకూ ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి ప‌డిపోయింది. ఇక్క‌డ టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా రాజ‌కీయాలు న‌డుస్తుండ‌గా కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది.

నిజామాబాద్ జిల్లాలో 2014 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ప‌ట్టుండేది. రెండుసార్లు పీసీసీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన డి.శ్రీనివాస్ స్వంత జిల్లా అయిన నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన నాయక‌త్వం, క్యాడ‌ర్ ఉండేది. 2004, 2009 ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. ఇంత ప‌ట్టున్న నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డింది. ఈ ప‌రిస్థితిని ఆ పార్టీ నేత‌లే చేతులారా చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బ‌లంగా ఉన్న రోజుల్లో కేవ‌లం నిజామాబాద్ ప‌ట్టణంలో మాత్ర‌మే భార‌తీయ జ‌న‌తా పార్టీకి కొంత ప‌ట్టుండేది. టీఆర్ఎస్‌కు కూడా జిల్లాలో రెండుమూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపేది. 2009 నుంచి తెలంగాణ ఉద్య‌మ ప్రభావంతో చాలా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవ‌ర్ధ‌న్ లాంటి నేత‌లు టీఆర్ఎస్‌లో చేరారు.

2014 ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్ జిల్లాలో బ‌ల‌మైన పార్టీగా ఎదిగింది. ఆ ఎన్నిక‌ల్లో స్వ‌యంగా కేసీఆర్ కూతురు క‌విత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి 1.67 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో గెలిచింది. రెండుసార్లు ఎంపీగా ప‌నిచేసిన మ‌ధుయాష్కి గౌడ్ 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత నిజామాబాద్‌లో క‌నిపించ‌డ‌మే మానేశారు.

పూర్తిగా జాతీయ రాజ‌కీయాల ప‌ట్ల దృష్టి పెట్టిన ఆయ‌న నిజామాబాద్‌ను వ‌దిలేశారు. ఆయ‌న నిజామాబాద్ కంటే భువ‌న‌గిరి నుంచి పోటీ చేయడం మేల‌ని భావించారు. దీంతో నిజామాబాద్‌లో క‌విత‌కు ప్ర‌త్య‌ర్థి లేకుండా పోయారు. ఈ గ్యాప్‌ను డి.శ్రీనివాస్ కుమారుడు ధ‌ర్మ‌పురి అర్వింద్ బాగా ఉప‌యోగించుకున్నారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కోవ‌డానికి అన్ని ర‌కాలుగా బ‌లాలు పోగేసుకున్న‌ ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో అనూహ్యంగా క‌వితపై విజ‌యం సాధించారు.

ఈ ఎన్నిక‌ల్లో అర్వింద్ గెలుపున‌కు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కార‌ణ‌మే. ఈ ఎన్నిక‌ల్లో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు లోపాయికారిగా అర్వింద్‌కు స‌హ‌క‌రించారు. మ‌ధుయాష్కి కూడా ఈ ఎన్నిక‌ల‌ను పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేదు. దీంతో అర్వింద్ విజ‌యం సాధించారు.

ఇప్పుడు ఆయ‌న బీజేపీని బ‌లోపేతం చేసే ప‌నిలో ప‌డ్డారు. నిజామాబాద్‌లో బీజేపీ ఎంత బ‌ల‌ప‌డితే కాంగ్రెస్ అంత బ‌ల‌హీనప‌డుతున్న‌ట్లే లెక్క‌. తాజాగా నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఒక‌ప్పుడు నిజామాబాద్ కార్పొరేష‌న్ కాంగ్రెస్ చేతుల్లోనే ఉండేది.

కానీ, ఈసారి మొత్తం 60 డివిజ‌న్ల‌లో కేవ‌లం ఆ పార్టీ రెండు మాత్ర‌మే గెల‌వ‌గ‌లిగింది. ఇదే స‌మ‌యంలో బీజేపీ 28 డివిజ‌న్లు గెలిచి మొద‌టిస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ 13, ఎంఐఎం 16 డివిజ‌న్లు గెలిచి మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకున్నాయి. నిజామాబాద్ న‌గ‌రంలో పూర్తిగా కాంగ్రెస్ ప‌రిస్థితికి ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలే అద్దం ప‌డుతున్నాయి. న‌గ‌రంలో కాంగ్రెస్‌ను ముందుకు న‌డిపించే నాయ‌కుడే లేక‌పోవ‌డం కూడా ఇందుకు కార‌ణం.

ఇక‌, జిల్లాలోని మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో క్యాడ‌ర్ బ‌లంగా ఉన్న కాంగ్రెస్ నాయ‌కులు పార్టీని స‌మ‌ర్థంగా ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోతున్నారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle