newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

10-07-202010-07-2020 08:14:19 IST
Updated On 10-07-2020 13:25:04 ISTUpdated On 10-07-20202020-07-10T02:44:19.589Z10-07-2020 2020-07-10T02:44:17.244Z - 2020-07-10T07:55:04.878Z - 10-07-2020

అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,410 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 30,946కు చేరింది. దేశంలో 30 వేలపైగా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కాగా, కొత్త కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌వే 918 ఉన్నాయి.

గురువారం రాష్ట్రవ్యాప్తంగా 7మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 331కు చేరింది. ఇప్పటి వరకు 18,192 మంది కరోనా వైరస్‌ నుండి కోలుకొని డిశ్చార్జి కాగా,  12,423 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 918 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్‌లో 67, సంగారెడ్డి 79, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 34, కరీంనగర్‌లో 32 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23, నల్లగొండ జిల్లాలో 21, నిజామాబాద్‌ జిల్లాలో 18, సూర్యాపేట జిల్లాలో 10, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8, మెదక్‌ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8, వికారాబాద్‌ 5, మహబూబాబాద్‌ జిల్లాలో 5, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 7, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, వనపర్తి, గద్వాల జిల్లాలలో 2 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ములుగు, సిద్దిపేట జిల్లాలలో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 331కి చేరిందని ప్రజారోగ్య శాఖ డైరక్టర్‌ తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,081 ఐసోలేషన్‌ పడకలు అందుబాటులో ఉండగా, 1,552 మంది రోగులు చికిత్స పొందుతున్నారని.. 15,529 పడకలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 

నత్తనడకన కరోనా పరీక్షలు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆ భారం టెస్టుల నిర్వహణపై పడుతోంది. వర్షాకాలం కావడంతో సీజనల్‌ జ్వరాలు మొదలయ్యాయి. వాతావరణ మార్పు వల్ల జ్వరం, జలుబు, దగ్గు వచ్చినా కూడా ‘కరోనా’యేమో అనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌ల వద్దకు పరుగెడుతున్నారు. కానీ, వెళ్లగానే అక్కడ పరీక్షలు చేసే పరిస్థితి ఉండట్లేదు. 

ఒక ప్రముఖ డయాగ్నస్టిక్‌ కేంద్రంలో ఇలా తీసుకున్న నమూనాలు ఎక్కువై.. రెండు రోజుల పాటు టెస్టుల ప్రక్రియను నిలిపివేసే పరిస్థితి నెలకొంది. దీంతో, అన్నిచోట్లా అపాయింట్‌మెంట్‌ ఉంటేనే పరీక్షలు చేస్తున్నారు. అపాయింట్‌మెంట్‌ కోసం ఆయా ల్యాబ్‌లు, ఆస్పత్రులు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లకు కాల్‌ చేయాల్సి  వస్తోంది. వాటికి కాల్‌ చేస్తే.. కనీసం రెండు రోజుల తర్వాతే అపాయింట్‌మెంట్‌ లభిస్తోంది. అప్పటికి కూడా ల్యాబ్‌ల వద్ద భారీ క్యూలు ఉంటున్నాయి. అంత కష్టపడి నమూనాలు ఇస్తే.. ఫలితాలు రావడానికి కనీసం 24 గంటల నుంచి 48 గంటల దాకా పడుతోంది.  

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   4 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   a day ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle