newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

అణచివేత ధోరణి వల్ల చేటే తప్ప ప్రయోజనం ఉండదు!

16-10-201916-10-2019 16:10:05 IST
Updated On 16-10-2019 17:09:00 ISTUpdated On 16-10-20192019-10-16T10:40:05.429Z16-10-2019 2019-10-16T10:40:01.499Z - 2019-10-16T11:39:00.408Z - 16-10-2019

అణచివేత ధోరణి వల్ల చేటే తప్ప ప్రయోజనం ఉండదు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచి వేయాలన్న కఠిన వైఖరి రాష్ట్రంలో తెరాస సర్కార్ పై ప్రజలలో, ఉద్యోగులలో ఒకింత వ్యతిరేకత వ్యక్తం అయ్యేందుకు ఆస్కారం ఇచ్చిందని చెప్పక తప్పదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న తెరాసపై విపక్షాలు ఎంతగా విమర్శలు గుప్పించినా జనం, ఉద్యోగులు మాత్రం తిరుగులేని విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం  ఇంతకాలం  కేసీఆర్పై ప్రజల్లో, ఉద్యోగుల్లో  నమ్మకాన్ని, ఆశను తుంచేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఎన్జీవో సంఘ నాయకులు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇచ్చేది లేదంటూ ప్రకటిస్తే...ఆ సంఘం నాయకులకు ఉద్యోగులలోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. అలాగే...ప్రజల నుంచీ నిరసన వెల్లువెత్తింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే ఎన్జీవో నాయకులు ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. 

ముఖ్యంగా సమ్మె చేస్తున్న ఉద్యోగుల ఇంకెంత మాత్రం ఆర్టీసీ సిబ్బంది కారని కేసీఆర్ ప్రకటించడం...ఆ వెంటనే ఆర్టీసీ ఆసుపత్రులలో సిబ్బందికి వైద్యం నిరాకరించడంతో  కెసిఆర్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది.  ఉద్యోగుల సమ్మె హక్కును కాలరాయడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ వ్యతిరేకత కారణంగానే మొత్తంగా తెరాస సర్కార్ పాలనా తీరుపైనే విమర్శనాత్మక సమీక్ష ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనంలో జరుగుతోంది. వాగ్దానాలు గుప్పించడమే తప్ప అములు చేసినవి వేళ్ల మీద లెక్కించవచ్చన్న వాదనకు బలం చేకూరుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ విద్య, దళితుడే ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్ గతంలో చేసిన వాగ్దానాలు, ప్రకటనలలోని డొల్ల తనాన్ని ఇప్పుడు జనం నేరుగా ప్రస్తావిస్తున్నారు. మిగులు రెవెన్యూతో ఆవిర్భవించినా రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోవడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పప్పు బెల్లాలకు ఖర్చు చేసి..అభివృద్ధిని విస్మరించారన్న విమర్శలు కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక తెలంగాణలో నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోయాయి. ఉద్యోగ నియామకాలు లేక యువత ఆందోళన చెందుతున్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోరుకుంటే నిరంకుశ తెలంగాణగా తయారైందని మేధావులు విమర్శిస్తున్నారు.

సమ్మెకు దిగిన కార్మికులపై కక్ష సాధింపు ధోరణి తప్ప కార్మికుల డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింప చేద్దామన్న ఉద్దేశమే ప్రభుత్వంలో కనిపించడం లేదు. విధానపరమైన నిర్ణయాలలో ప్రభుత్వానికి సూచనలూ సలహాలూ ఇవ్వాల్సిన అధికార యంత్రాంగం నిమిత్త మాత్రంగా మారిపోయింది. కేసీఆర్ ఏం చెబితే అదే వేదం అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితులు తయారయ్యాయి.

తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారంతా ఇప్పుడు ప్రభుత్వానికి అయిష్టులుగా మారిపోయారు.  తెలంగాణ సాధన పోరులో సకల జనులూ కదిలారు, పోరాడారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికలకు మద్దతుగా సకల జనులూ కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా ప్రభుత్వోద్యోగులతో వైరం పెట్టుకున్న ఏ ముఖ్యమంత్రీ రాజకీయంగా నష్టపోకుండా మిగిలిన చరిత్ర లేదు.

ఎన్టీఆర్, చంద్రబాబు, చెన్నారెడ్డి ఇలా పలువురు ముఖ్యమంత్రులు ఉద్యోగుల ఆగ్రహానికి గురై పదవీచ్యుతులైన వారే. ఎప్పటికి ఏది అవసరమో అది చేయడం అనే విధానం ద్వారా ఇన్నాళ్ళూ తెరాస అధినేత కేసీఆర్ నెట్టుకొచ్చారు. అయితే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం అనే అస్త్రం ప్రయోగించడం ద్వారా ఆయన అన్ని వర్గాల విశ్వాసాన్నీ కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఉద్యోగ సంఘం నాయకులు ఆయనతో చర్చించిన వెంటనే ( నిజానికి గత ఏడాది కాలంగా ఉద్యోగ సంఘాల నాయకులకు కేసీఆర్ కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు) ఆ నాయకులు ఆర్టీసీ సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడారు. మామూలు పరిస్థితుల్లో అయితే అది చెల్లిపోయేది.

కానీ ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు జనం మద్దతు ఉండటంతో ఎన్జీవో సంఘం నాయకులు అనివార్యంగా ఆర్టీసీకి మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే సమ్మె మరి కొన్ని రోజులు సాగే పరిస్థితి ఉండే తెరాస సర్కార్ దిగిరాక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి.  తెరాస నాయకులలోనే ఇప్పుడిప్పుడే సమ్మెను అణచివేసే విధానం సరికాదన్న భావన వ్యక్తమౌతుంది. మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ కేకే ముందుకు రావడం అందులో భాగమే. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకోకుంటే మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు రావడం ఖాయం.

 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   7 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   9 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle