newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యమే,.. శ్రీశైలం పవర్ హౌస్‌పై విపక్షాల ఫైర్

27-08-202027-08-2020 13:28:07 IST
Updated On 27-08-2020 16:04:52 ISTUpdated On 27-08-20202020-08-27T07:58:07.647Z27-08-2020 2020-08-27T07:57:56.355Z - 2020-08-27T10:34:52.795Z - 27-08-2020

అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యమే,.. శ్రీశైలం పవర్ హౌస్‌పై  విపక్షాల ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం ప్రమాదంలో మృతిచెందిన ఏఈ సుందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన విద్యుత్‌ ప్లాంట్‌లో ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిపుణుల కమిటీ కోసం డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, మల్లురవి శ్రీశైలం వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. 

ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాద సంకేతాలపై సిబ్బంది లేఖ రాసినా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించలేదని రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. డ్యాం భద్రత, విద్యుత్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై గత కొన్నేళ్లుగా ఆందోళన ఉందన్నారు. వీటన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వ పెడచెవిన పెట్టిందన్నారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 9 మంది మరణం, వేల కోట్ల జాతి సంపదకు నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పవర్‌ ప్లాంట్‌లో రెండేళ్ళ క్రితమే బ్యాటరీలు మార్చాల్సిఉన్నా.. ఎందుకు మార్చలేదని విమర్శించారు  కోమటిరెడ్డి. ఏఈ సుందర్ నాయక్ కుటుంబానికి రూ. 2 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

అవన్నీ అబద్దం... వేలకోట్ల నష్టం జరగలేదు 

మరోవైపు విపక్షాలు చెబుతున్నవి అవాస్తవాలంటోంది ప్రభుత్వం. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం వల్ల వేల కోట్ల నష్టం జరిగిందన్న ప్రచారం వాస్తవం కాదని జెన్ కో ఎమ్.డి డి.ఫ్రభాకరరావు చెప్పారు. ఆయన ప్రాజెక్టు ప్రదేశాన్ని సందర్శించారు. 

ప్రమాదం జరిగిన యూనిట్ లను ఆయన పరిశీలించారు. జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ బాగా దెబ్బతిందని ఆయన అన్నారు.ఒకటి,రెండు,ఐదు యూనిట్ లలో కొంత నష్టం జరిగిందని,ఆరో యూనిట్ లో పానెల్ దెబ్బతిందని ఆయన తెలిపారు.త్వరలోనే వీటి పునరుద్దరణ జరుగుతుందని ఆయన తెలిపారు.దురదష్టవశాత్తు ప్రాణ నస్టం జరిగింది కాని ఆస్తి నష్టం మరీ అదికంగా జరగలేదని ఆయన చెప్పారు. 6వ యూనిట్ లో ప్యానెల్ దెబ్బ తిందని ఆరవ యూనిట్‌లో ప్రారంభమయిన మంటలు మిగతా యూనిట్లకు అంటుకున్నాయి, నాల్గో యూనిట్ పూర్తిగా కాలిపోయిందన్నారు. దురదృష్టవశాత్తు ప్రాణ  నష్టం జరిగిందని అదే  చాలా బాధాకరం అన్నారు ప్రభాకర్ రావు. 

త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభిస్తాం. విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి దుర్ఘటనలను మళ్లీ జరగకుండా ఏమి చేయాలో అన్నీ చేస్తాం. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేసి, తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థల ఉద్యోగులు యావత్ దేశం దృష్టిని ఆకర్షించే ఎన్నో అద్భుత విజయాలు సాధించారు.

తెలంగాణ ప్రజలకు విద్యుత్ ఉద్యోగులపై ఎంతో విశ్వాసం, అభిమానం ఉన్నాయి. వాటిని నిలుపుకోవడం ముఖ్యం అన్నారు. తన సోదరుడు శ్రీనివాసరావు మరణించాడన్న వార్త తెలిశాక కూడా ప్రభాకర్ రావు ప్లాంటులో పర్యటించారు. తన సొంత అన్న మరణించిన దుఃఖాన్ని పంటి బిగువన దిగమింగుకుని తమకు ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రభాకర్ రావుకు పలువురు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సోదరుడి మరణం పట్ల విచారం, సానుభూతి వ్యక్తం చేశారు. 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   10 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle