newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

అడవిలోకి రానివ్వకపోతే బతకటం ఎలా.. దీనికీ పవన్ కల్యాణే రావాలా?

20-09-201920-09-2019 10:40:47 IST
Updated On 20-09-2019 10:58:03 ISTUpdated On 20-09-20192019-09-20T05:10:47.489Z20-09-2019 2019-09-20T05:10:44.523Z - 2019-09-20T05:28:03.550Z - 20-09-2019

అడవిలోకి రానివ్వకపోతే బతకటం ఎలా.. దీనికీ పవన్ కల్యాణే రావాలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపున ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ వెదురు కోసం అటవీ అధికారులు మేదర్లను అడవిలోకి పోనీకుండా అడ్డుకుంటున్నారు. తమ వృత్తికీ, ఉనికికీ భంగకరంగా అడ్డునిలుస్తున్న ఫారెస్ట్ అధికార్ల పట్ల, ప్రభుత్వ వైఖరిపట్ల తీవ్ర నిరసన తెలుపుతూ మేదరులు కరీంనగర్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు తీశారు. అడవిలోకి పోనీయకపోతే పోయె... కనీసం గ్రామాల్లోనైనా వెదురు పెంపకానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరుతూ కలెక్టర్ శరత్‍‌కు వినతిపత్రం కూడా సమర్పించారు.

ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని సారంగాపూర్‌ మండలంలో మేదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ వినియోగం పెరగడంతో పర్యావరణంతో పాటు తమ వృత్తి కూడా పూర్తిగా దెబ్బతింటోందని. ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని కోరారు. ప్లాస్టిక్‌ వాడకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, తాము తయారు చేసే వెదురు వస్తువులను ఎవరూ కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు తమను అడవిలోకి అనుమతించడం లేదన్నారు. వెదరు పెంపకాన్ని ప్రొత్సహించేందుకు ప్రతీ మండలంలో ఐదెకరాలు వెదురు పెంపకానికి అటవీశాఖకు సంబంధం లేకుండా భూమిని కేటాయించాలని కోరారు. 

మేదరులా ర్యాలీలో వారు ధరించిన వెదురు టోపీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెదరుతో చేసిన టోపీలు నీడతోపాటు చల్లని గాలిని ఇస్తుండడంతో పలువురు కొనేందుకు ఆసక్తి చూపారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వెదురుబొంగులు దొరకడం లేదని, అందుకే వెదురు పెంపకానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలన్నది వీరి డిమాండ్. దానికంటే మించి అటవీశాఖ సిబ్బంది వేధింపుల నుంచి తమను రక్షించాలని వీరు కోరుతున్నారు.

ఒకటి మాత్రం నిజం. అడవుల పరిరక్షణ పేరుతో అడవిపై ఆధారపడి జీవించే వారి ఉనికికి భంగకరంగా విధానాలు అమలు చేస్తున్న తీరు కొనసాగేంతవరకు మేదర్లే కాదు ఏ వృత్తి వారైనా తిరగబడక తప్పదు. ఈ అన్యాయం కొనసాగితే రేపో మాపో సినీనటుడు కమ్ రాజకీయనేత పవన్ కల్యాణ్ వీరికి మద్దతుగా ముందుకు వచ్చినా సందేహపడాల్సిన పనిలేదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle