newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

అటవీ అధికారిణి అనితపై దాడికేసులో కీలక మలుపు

20-07-201920-07-2019 09:56:52 IST
Updated On 20-07-2019 10:08:10 ISTUpdated On 20-07-20192019-07-20T04:26:52.890Z20-07-2019 2019-07-20T04:26:46.109Z - 2019-07-20T04:38:10.004Z - 20-07-2019

అటవీ అధికారిణి అనితపై దాడికేసులో కీలక మలుపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోని సార్సల గ్రామంలో అటవీ శాఖ అధికారి అనితపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ చేసిన దాడిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది శాంతి భద్రతల సమస్య అని తేల్చి చెప్పింది. 

ఈ వ్యవహారాన్ని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని , ఇలాంటి ఘటనలు జరగడానికి వీలులేదని స్పష్టం చేసింది. పర్యావరణానికి సంబంధించిన అంశాలపై కోర్టుకు సహాయకుడిగా వ్యవహరించే సీనియర్ న్యాయవాది ఏడి ఎన్ రావు ఈ ఘటనను నాలుగు రోజుల కిందటే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ ఘటన చాలా తీవ్రమయినదని, అటవీ అధికారుల నైతిక స్థయిర్యం దెబ్బతినకుండా చూడాలని న్యాయవాది ఏడీఎన్ రావు కోరగా దీనిపై పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు దాడికి గురైన అనితపై ఎస్సి ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సాగిస్తున్న దర్యాప్తుపై స్టే విధించింది.

ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అనితకు పోలీసు భద్రత కల్పించాలని న్యాయవాది కోరగా, అందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ పరిశీలనకు పంపించాలని న్యాయవాది కోరారు. 

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈఅంశం శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కాబట్టి తామే పరిశీలిస్తాం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాడికి గురైన అనితకు తనకు ప్రాణహాని ఉందని తెలిపిన అంశం కోర్టుకి విన్నవించారు. హరితహారం కార్యక్రమం క్రింద అటవీ కరణ ప్రాజెక్టు చేపడుతున్న క్రమంలో జూన్ 29 న ఎమ్మెల్యే సోదరుడు, తన బలగాన్ని వెంటేసుకొని వెళ్లి ఆమెపై దాడి చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

మొక్కలు వేయడానికి ఎంపిక చేసిన భూమి తనదని వాదిస్తూ, దౌర్జన్యానికి దిగారన్నారు. ఇంత జరిగినా మహిళ అధికారిని కాపాడాల్సిన ప్రభుత్వం ఆమెపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని విన్నవించారు. అనితపై దాడికి సంబంధించి వివిధ మీడియా కథనాలను, క్లిప్లింగులను పిటిషన్ కు జతపరిచారు. మొత్తం మీద అనిత కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

అటవీ అధికారిణికి షాక్.. ఎస్సీఎస్టీ కేసు

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

   2 hours ago


దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

   3 hours ago


లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు1

లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు1

   3 hours ago


మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

   3 hours ago


గులాబీ లీడ‌ర్స్‌తో ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌ గొడ‌వేంటి..?

గులాబీ లీడ‌ర్స్‌తో ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌ గొడ‌వేంటి..?

   4 hours ago


నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   19 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   19 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   20 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   21 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle