newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

అచ్చంపేట ఘటన.. వైద్యులు చేసిన హత్య అంటున్న బంధువులు

21-12-201921-12-2019 16:16:55 IST
2019-12-21T10:46:55.360Z21-12-2019 2019-12-21T10:46:53.366Z - - 25-02-2020

అచ్చంపేట ఘటన.. వైద్యులు చేసిన హత్య అంటున్న బంధువులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఘటన తెలంగాణవ్యాప్తంగా వివాదం రేపుతోంది. ఆస్పత్రిలో డెలివరీ కోసం గర్భిణీ వస్తే.. శిశువు తలను అమాంతం బయటకు లాగేయడంతో మొండెం తల వేర్వేరు అయ్యాయి. ఈ పాపం తమకు అంటకుండా తెగిపోయిన మొండేన్ని తల్లి కడుపులోకి నెట్టేశారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. 

ఆస్పత్రి  సూపరింటెండెంట్ డాక్టర్ తారా సింగ్, డ్యూటీ డాక్టర్ ఉషారాణిలు స్వాతి అనే మహిళకు డెలివరీ చేసే ప్రయత్నం చేశారు. తల్లికి ఇంజెక్షన్ ఇవ్వడంతో గర్భం నుంచి శిశువు తల బయటకు వచ్చింది. అత్యంత జాగ్రత్తగా డెలివరీ చేయాల్సిన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవరించారనే ఆరోపణలున్నాయి. ఈక్రమంలో శిశువు తలను గట్టిగా లాగడంతో తల, మొండెం వేర్వేరు అయ్యాయి. తలను దాచేసి, మొండెం గర్భంలోకి నెట్టేశారు. 

తమ తప్పు బయటపడకుండా ఉండేందుకు శిశువు ఎప్పుడో చనిపోయిందని డ్రామా ఆడారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్ళాలన్నారు. ఆపరేషన్ చేయలేమని చేతులెత్తేశారు. బిడ్డ పోయింది కదా కనీసం తల్లినైనా బతికించమని బంధువులు ప్రాధేయపడినా వినిపించుకోలేదు.

దీంతో స్వాతిని పేట్లబురుజు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వాతి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఈ వ్యవహారంపై బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. హెల్త్ కమిషనర్ విచారణ చేపట్టారు. బాధ్యులైన తారాసింగ్, సుధారాణిలను సస్పెండ్ చేశారు. 

ఈ ఘటనపై కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించింది విచారణ బృందం. అయితే మృత శిశువుతోనే ఆసుపత్రికి వచ్చారంటున్నారు ఆసుపత్రి సుపరింటెండెంట్ తారాసింగ్. శిశువు కుళ్ళిన దశలో ఉండడంతో డెలివరీ చేసే సమయంలో తల ఊడి వచ్చిందని, తల్లిని బతికించేందుకే హైదరాబాద్ తీసుకెళ్ళామని, శిశువు తలను పోలీసులకి అప్పగించాం అని ఆసుపత్రి సుపరింటెండెంట్ తారాసింగ్ చెబుతున్నారు. అయితే ముమ్మాటికీ ఇది వైద్యులు చేసిన హత్య అంటున్నారు స్వాతి బంధువులు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అనే పాట ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంటుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle