అఖిలపక్షంతో చర్చించాలి.. తెలంగాణ బీజేపీ డిమాండ్
21-04-202021-04-2020 09:52:05 IST
Updated On 21-04-2020 10:27:42 ISTUpdated On 21-04-20202020-04-21T04:22:05.810Z21-04-2020 2020-04-21T04:21:34.738Z - 2020-04-21T04:57:42.422Z - 21-04-2020

తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోవడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ వేళ రైతులకు భరోసా కల్పించేందుకు పంటలు నష్టపోయిన ప్రాంతాలలో బీజేపీ టీం పర్యటించిందని బండి సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ లో కనీసం రైతులకు భరోసా ఇవ్వలేక పోయారని విమర్శించారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల విషయంలో టైంపాస్ పాలిటిక్స్ ప్రభుత్వం చేస్తోందని, నిర్దిష్టవిధానాలు లేవన్నారు. పిడుగు పాటుతో రైతులు మృతి చెందారని, ..అకాల వర్షం లతో చాల పంటలు నష్టపోతే పరామర్శించడానికి కూడా మంత్రులకు అవకాశం లేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కరోనా పై మాట్లాడుతున్నారన్నారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సైతం అఖిలపక్షం ఏర్పాటు చేసి కరోనా పై చర్చించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విపక్షాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని వాటిని అమలుచేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇళ్ల కిరాయి వద్దు అన్నారని దానిని స్వాగతిస్తున్నామని, అయితే ఇళ్ల టాక్స్ సైతం కూడా మాఫీ చేయించాలన్నారు. ప్రభుత్వం విపక్షాలు ఇచ్చే సూచనలను విమర్శలుగా చూస్తున్నారని, సలహాలు సూచనలుగా పరిగణించాలని హితవు పలికారు. కరోనా పై ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని,భైంసాలో విధ్వంసం కాండ లో రాజు అనే వ్యక్తి చనిపోవడం బాధాకరం అని బాధితుడి కుటుంబానికి బిజెపి అండగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ దొంగల ముఠాగా మారిన ఎంఐఎం పార్టీ పై ప్రభుత్వం స్పందించడంలేదని, హిందువుల పై దాడిని ఏ ఒక్క మీడియాలో చూపంచలేదన్నారు. హిందువులపై దాడి జరిగిన ఏ రాజకీయ పార్టీ స్పందించకపోవడం బాధాకరం అన్నారు ఎంపీ సంజయ్. ఎంఐఎం టిఆర్ఎస్ రెండూ ఒక్కటే తాము ముస్లింలకు ఇస్లాంకు వ్యతిరేకం కాదన్నారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా