అక్రమ కట్టడాలపై కేసీఆర్ అల్టిమేటం
19-07-201919-07-2019 14:57:13 IST
Updated On 19-07-2019 15:15:40 ISTUpdated On 19-07-20192019-07-19T09:27:13.822Z19-07-2019 2019-07-19T09:27:10.175Z - 2019-07-19T09:45:40.199Z - 19-07-2019

ఒకవైపు తెలుగు రాష్ట్రం ఏపీలో అక్రమకట్టడాల కూల్చివేత యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. మాజీ సీఎం ప్రజావేదికను కూల్చేశారు. మరికొన్ని అక్రమ కట్టడాలకు సంబంధించి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు. అక్రమ కట్టడం చేపడితే.. నోటీసులివ్వకుండానే కూల్చేస్తాం అని అసెంబ్లీలో కేసీఆర్ సంచలన ప్రకటన చేయడం చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో అక్రమ కట్టడాలను చేపడితే సహించేది లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి యజమాని ఇంటిపై సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలని.. ప్రతి ఇంటిని స్వ్కాడ్స్ కొలుస్తారని కేసీఆర్ తెలిపారు. ఎవరు ఎప్పుడు, ఎక్కడ కొలుస్తారో చెప్పరన్నారు. ట్యాక్స్‌పై అబద్దం చెబితే 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. అక్రమ కట్టడం చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామన్నారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమన్నారు.ఆగస్టు 15నుంచి పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని ఆయన అన్నారు. కొత్త మున్సిపల్ చట్టంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో కేసీఆర్ ప్రసంగించారు. దేశమే మన దగ్గర నేర్చుకునేలా పాలన సంస్కరణలు తెస్తామని, అలాగే ప్రజాదర్బార్ నిర్వహించి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని, పట్టణాలు, గ్రామాల్లో పచ్చదనం పెంచుతామన్నారు. హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే సర్పంచుల పదవులు కూడా పోతాయని, 85 శాతం మొక్కలు బతికితేనే పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ఉంటుందని కేసీఆర్ అన్నారు. మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్, ఇన్ఛార్జ్ ఆఫీసర్‌కు చెట్ల పెంపకం బాధ్యత అప్పగించనున్నారు. ‘85 శాతం మొక్కలు బతికించాలి.. లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తాం’ అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రకటనతో అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’
9 hours ago

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్
12 hours ago

దిశ ఎన్ కౌంటర్ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
13 hours ago

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు
13 hours ago

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి
13 hours ago

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!
15 hours ago

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?
15 hours ago

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
15 hours ago

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం
17 hours ago

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్హెచ్ఆర్సీపై రోజా ధ్వజం
18 hours ago
ఇంకా