newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అక్రమాస్తుల గుట్టురట్టు... అవినీతి సామ్రాట్లు ఇంకెందరో?

16-08-202016-08-2020 12:28:07 IST
Updated On 16-08-2020 14:40:12 ISTUpdated On 16-08-20202020-08-16T06:58:07.647Z16-08-2020 2020-08-16T06:57:45.281Z - 2020-08-16T09:10:12.258Z - 16-08-2020

అక్రమాస్తుల గుట్టురట్టు... అవినీతి సామ్రాట్లు ఇంకెందరో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంలో కోటి 10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ అక్రమాస్తుల గుట్టా బట్టబయలు అవుతోంది. అతను అక్రమంగా రూ.150 కోట్లకుపైగా సంపాదించాడని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతని నివాసంలో 36 గంటలపాటు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ తాళాలను స్వాధీనం చేసుకున్నారు.

నాగరాజుపై ఫిర్యాదు రావడంతో శుక్రవారం రైడ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు కూడా అతనిపై ఏసీబీ ఫోకస్ చేసింది. గతంలో అవినీతి వ్యవహారంలో అరెస్టైనా.. తీరు మారకపోవడంతో ఏసిబి అధికారులు వీరిపై దృష్టిసారించింది. శుక్రవారం నుంచి 36 గంటలపాటు అల్వాల్‌లోని నాగరాజు ఇంటిలో సోదాలు నిర్వహించారు. రూ. 32 లక్షల నగదు పట్టుబడింది. 

రెండు కిలోల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులలో ఉన్ లాకర్లను గుర్తించారు. వాటిని సోమవారం తెరుస్తామని.. అందులో కీలక పత్రాలు ఉండే అవకాశం ఉంది.నాగరాజుతో పాటు వీఆర్వో, ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను శనివారం ఏసీబీ కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించారు.

నాగరాజు బంధువులు, స్నేహితులపై కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు.శామీర్ పేటలో పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాగరాజు అరెస్టయ్యారు. జైలుకెళ్లి తిరిగొచ్చినా.. అవినీతిని మాత్రం ఆపలేదు. తన దగ్గరకు వచ్చేవారిని అడిగి మరీ లంచం తీసుకునేవాడని ఆరోపణలున్నాయ్.

కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాంకు లాకర్లలో కూడా భారీగా నగదు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ఉండొచ్చని భావిస్తున్నారు. కీసరలోని నాగరాజు కార్యాలయం నుంచి కూడా కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తహసీల్దార్‌ నాగరాజు అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తోంది. సామాన్య ప్రజలే కాదు, మాజీ అధికారులు, ప్రముఖులు కూడా అతని బాధితులేనని తెలుస్తోంది. పోలీసు అధికారుల వద్ద నుంచి లంచం తీసుకున్నట్టు తెలుస్తోంది.బాధితుల్లో తాను ఒకరినని రిటైర్డ్ అదనపు ఎస్పీ సురేందర్‌ రెడ్డి తెలిపారు. న్యాయపరంగా అన్ని పత్రాలు ఉన్నా.. పట్టా పాస్ పుస్తకం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని సురేందర్ రెడ్డి తెలిపారు.

రిటైర్ అయ్యాక 2018లో సర్వేనెంబర్‌ 614లో 4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. దానికి సంబంధించి తన వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని.. కానీ పట్టా పాస్‌బుక్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు. దీనిపై ఇది వరకు తాను సీఎస్‌, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేశానని రిటైర్డు పోలీసు వివరించారు. అయినప్పటికీ ఫలితం లేదు అని సురేందర్ రెడ్డి తెలుపడం గమనార్హం. పోలీసు అధికారి తననే లంచం అడిగాడంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని కోరారు. రియల్ ఎస్టేట్ మీడియేటర్స్‌తో కలిసి దందా చేస్తున్నాడని తెలిపారు.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle