newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అక్బరుద్దీన్‌నూ కేసీఆర్ శపిస్తారా.. రాములమ్మ వ్యంగ్యాస్త్రాలు..!

26-04-202026-04-2020 11:51:29 IST
Updated On 26-04-2020 12:04:36 ISTUpdated On 26-04-20202020-04-26T06:21:29.858Z26-04-2020 2020-04-26T06:21:27.178Z - 2020-04-26T06:34:36.384Z - 26-04-2020

అక్బరుద్దీన్‌నూ కేసీఆర్ శపిస్తారా.. రాములమ్మ వ్యంగ్యాస్త్రాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాములమ్మ విజయశాంతి మరోసారి సీఎం కేసీఆర్ పై వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటున్న ఎంఐఎం పార్టీ ముఖ్యనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలనే అస్థ్రాలుగా చేసుకొని విమర్శలకు దిగారు. ఒకేదెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా అటు ఎంఐఎం, ఇటు టీఆర్ఎస్ పార్టీలకు చురకలు అంటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గాంధీని ఆసుపత్రిని సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అది గాంధీ ఆసుపత్రినా? లేక జైలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉండాల్సిన కనీస వసతులు కూడా గాంధీలో లేవని కరోనాకి చికిత్స పేరుతో రోగులను ఖైదీలను చేసి అక్కడ పడేస్తున్నారని విమర్శలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆయన పరిపాలనను ఎవరైనా విమర్శిస్తే అయనకు నచ్చదు. అందుకు ఆయన విమర్శించిన వారిని చెడామడా తిట్టేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వాళ్లకి శాపనార్ధాలు కూడా పెడతారని తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్టానికి సంబంధించిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే గాంధీలో వసతులు లేవన్నది తొలి నుండి వస్తున్న ఆరోపణ.

ఇక కరోనా వైరస్ మీద ఉన్న భయంతో గాంధీలో తొలి రోజులలో పరిస్థితి బాగోలేదని అక్కడ కనీస వసతులు కూడా లేవని ఓ దినపత్రిక కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనం రాసుకొచ్చింది. అంతే సీఎం కేసీఆర్ ఆ పత్రికపై అంతెత్తున లేచారు. మీడియా సమావేశంలోనే ఆ పత్రిక యజమానికి.. కథనం రాసిన వాళ్ళకి కూడా కరోనా రావాలని శాపనార్ధాలు పెట్టారు. వాళ్లకి వైరస్ సోకి అదే గాంధీలో పడుకొని వసతులు ఎలా ఉన్నాయో చూడాలని కేసీఆర్ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

ఆ తర్వాత ఆ పత్రిక యజమాని కూడా అదే స్థాయిలో స్పందించారు అది వేరే విషయం. సీఎం కేసీఆర్ తనను విమర్శిస్తే రియాక్షన్ ఇలా ఉంటుంది. కానీ తాజాగా అదే గాంధీలో వసతుల గురించి.. అదే కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స గురించి.. ఆహారం గురించి కేసీఆర్ మిత్రుడైన ఎంఐఎం అక్బరుద్దీన్ తీవ్ర విమర్శలు చేశారు. అది గాంధీ ఆసుపత్రి కాదు జైలును మించి దారుణంగా ఉందని విమర్శించారు.

కరోనా రోగులను జైల్లో ఖైదీని చూసినట్లుగానే చూస్తున్నారని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన విజయశాంతి సీఎం కేసీఆర్ ఇప్పుడు అక్బరుద్దీన్ ను కూడా శపిస్తారా? కేసీఆర్ శాపాల గురించి అక్బరుద్దీన్ కి తెలియదా? లేక మిత్రులే కనుక శాపం తనకు వర్తించదని అనుకుంటున్నారా? అక్బరుద్దీన్ శాపాలకు అతీతమా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తూ ఏది ఏమైనా కేసీఆర్ ఎలాంటి శాపాలు పెడతారోనని రాష్ట్రప్రజలంతా భయపడుతున్నారని సెటైర్లు వేశారు.

 

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   30 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   10 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle