newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

13-07-202013-07-2020 08:18:11 IST
Updated On 13-07-2020 08:35:56 ISTUpdated On 13-07-20202020-07-13T02:48:11.165Z13-07-2020 2020-07-13T02:48:05.682Z - 2020-07-13T03:05:56.584Z - 13-07-2020

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్నాటక, తమిళనాడు తరువాత తెలంగాణలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.  కొన్ని రోజులుగా బెంగళూరు, హైదరాబాద్ న‌గరాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత రెండు రోజుల్లో బెంగళూరులో నమోదైన పాజిటివ్ కేసులు ముంబయిని మించిపోయాయంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటకలో ప్రతి 9 రోజులకు కేసులు రెట్టింపు అవుతుంటే, తెలంగాణలో అది ప్రతి 10 రోజులకు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు రెట్టింపయ్యే సమయం 13 రోజులు కాగా, కేరళలో 18 రోజులు పడుతోంది. 

హైదరాబాద్ లో రోజూ పెరుగుతున్న కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే వచ్చే రెండు వారాలలో ఇన్ఫెక్షన్ తార స్థాయికి చేరవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు కరోనా పెరుగుతోంది. అయితే హైదరాబాద్ చుట్టపక్కల తగినంత స్థాయిలో పరీక్షలు జరగకపోవడంతో తీవ్రతస్థాయి తెలియడం లేదు.

సరిగ్గా టెస్టింగ్ నిర్వహించకపోతే చాలా కేసులను కనిపెట్టలేని ప్రమాదం ఉంది. హైదరాబాద్ ఇప్పుడు ఒక క్లిష్ట దశలో ఉంది.  కిక్కిరిసిన ప్రాంతాలలో సామాజిక వ్యాప్తి జరుగుతోంది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ తో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో పాటు, ప్రజలు కూడా అవసరమైన జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ లు ధరించడం, అవసరమయితే తప్ప బయటకు రాకుండా ఉండడం ఎంతో అవసరం. ఈ వైరస్ ఇప్పట్లో అంతమయ్యేది కాదని నిపుణులు అంటున్నారు.

ఇదిలా వుంటే ఆదివారం మొత్తం 1269 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,671కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11,883గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1563 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 22,482 కు చేరింది.

కరోనా వైరస్ తీవ్రత వల్ల ఆదివారం మరో 8 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 356కి చేరింది.ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 800 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 132 కొత్త కేసులు వచ్చాయి. తర్వాత స్థానంలో వున్న మేడ్చల్ జిల్లాలో 94, హైదరాబాద్ శివారున వున్న సంగారెడ్డి జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle