newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

26-05-202026-05-2020 11:11:21 IST
Updated On 26-05-2020 12:14:11 ISTUpdated On 26-05-20202020-05-26T05:41:21.279Z26-05-2020 2020-05-26T05:40:19.324Z - 2020-05-26T06:44:11.894Z - 26-05-2020

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ తర్వాత ఇతర ప్రాంతాలకు మార్గం సుగమం అయిందని భావించిన వారి సంతోషంపై వేడినీళ్ళు చల్లుతున్నాయి విమానయాన సంస్థలు.  రెండు నెలల తర్వాత డొమెస్టిక్ ఎయిర్ లైన్ సర్వీసెస్ ప్రారంభమయ్యాయి.. కరోనాని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ లో భాగంగా విమానాలను ఆపివేశారు.. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సర్వీసులు నడిచాయి.. కొన్నిరాష్ట్రాలు విమాన సర్వీసులు తగ్గించాలని కోరడంతో షెడ్యూల్ చేసిన విమానాలు రద్దయ్యాయి.. దీంతో కొందరు ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈరోజు డొమెస్టిక్ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.. లాక్ డౌన్ తో ఇన్ని రోజుల పాటు ఆగిపోయిన విమానాలు తిరిగి టేకాఫ్ అయ్యాయి.. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి మాత్రమే విమాన సర్వీసులు నడిచాయి.. కానీ ఈరోజు నుంచి పూర్తి స్థాయి డొమెస్టిక్ ప్యాసింజర్ సర్వీసులు స్టార్ట్ చేశారు..

రెగ్యులర్ గా నడిచే డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో 30శాతం నడిపించాలని కేంద్రం పర్మిషన్ ఇచ్చింది.. దీనిలో భాగంగా ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 36 సిటీస్ కి 120 డొమెస్టిక్ సర్వీసులను షెడ్యూల్ చేశారు.. ఇందులో విమానాలు డిపార్చర్ కాగా 60 విమానాలు అరైవల్ నడపాలని అనుకున్నారు.. కానీ కొన్ని రాష్ట్రాలు సర్వీసులు తగ్గించాలని కోరడంతో ఇందులో 75శాతం సర్వీసులు రద్దు చేశారు.. 15 డిపార్చర్ ఫ్లైట్స్ అండ్ 15 అరైవల్ ఫ్లైట్స్ మాత్రమే నడిచాయి... 

ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 5గంటలకు లక్నోకి  మొదటి ఫ్లైట్ షెడ్యూల్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయింది.. ఉదయం 8గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ నుంచి కర్ణాటక లోని విద్యానగర్ కి ట్రూజెట్ విమానం టేకాఫ్ అయింది.. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని తెలియక చాలా మంది ప్యాసింజర్స్ ఎయిర్ పోర్ట్ కి వచ్చి తిరిగి వెళ్లారు.. విమానాల రద్దుకు సంబంధించిన ఎయిర్ లైన్ కంపెనీస్ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు..

ఇక కరోనా సోకకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ని తగ్గించారు.. ఎయిర్ పోర్ట్ లో మొత్తం 85 సెన్సార్ సానిటైజర్ మిషన్లు ఏర్పాటు చేశారు.. ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి.. ఎయిర్ పోర్ట్ ఎంట్రీ గేట్స్ దగ్గర ఐడీ కార్డును సెక్యూరిటీ సిబ్బందికి డైరెక్ట్ గా చూపించకుండా కెమెరా ద్వారా చెక్ చేస్తున్నారు.. ప్రతీ ప్యాసింజర్ టెంపరేచర్ ని చెక్ చేస్తున్నారు.. ఫిజికల్ డిస్టేన్స్ కోసం స్పెషల్ గా స్టిక్కరింగ్ చేశారు.. ప్రయాణీకులందరూ తమ సెల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం కూడా తప్పనిసరి.. ఒకవేళ యాప్ లేనట్లైతే వారి ఫోన్లలో అక్కడిక్కడే డౌన్ లోడ్ చేసుకోవడంలో ఎయిర్ ట్రావెల్ సిబ్బంది సహాయం చేస్తారు..

ప్రతీ ప్యాసెంజర్ ఫ్లైట్ టైమ్ కన్నా రెండు గంటలు ముందుగా ఉండాలి.. లగేజ్ కూడా వీలైనంత తక్కువగా తీసుకెళ్లాలని సూచించారు ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. మరోవైపు ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సొంత దేశానికి తీసుకొస్తున్న విమానాలకు సంబంధించి కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు. విమానాల్లోనూ సోషల్ డిస్టెన్సింగ్ అవసరమని పేర్కొంది సుప్రీంకోర్టు. జూన్ 6 నుంచి మిడిల్ సీట్ ను ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో సోషల్ డిస్టెన్స్ అనేది కామన్ సెన్స్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఎయిర్ లైన్స్ సంస్థల సంక్షేమం కంటే ప్రజల హెల్త్ గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో జూన్ 6వరకే మిడిల్ సీట్ టికెట్ల బుకింగ్ కు అనుమతించనుంది ఎయిర్ ఇండియా. వందే భారత్ మిషన్ ద్వారా ఎయిర్ ఇండియా విమానాల్లోనే విదేశాల నుంచి భారతీయులను తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికైతే అన్ని సీట్లలోనూ ప్రయాణికులను తీసుకొస్తున్నారు.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   12 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle