అందుకేనా ఆ పర్యటన.. కేసీయార్‌పై బీజేపీ నారాజ్
02-01-202002-01-2020 07:49:17 IST
Updated On 02-01-2020 15:18:59 ISTUpdated On 02-01-20202020-01-02T02:19:17.549Z02-01-2020 2020-01-02T02:19:13.558Z - 2020-01-02T09:48:59.243Z - 02-01-2020

తెలంగాణలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నిత్యం ప్రజల్లో వుండేందుకు అన్ని విధాలా ప్రణాళికలతో ముందుకెళుతోంది. కేసీయార్ ని టార్గెట్ చేసిన బీజేపీ పౌరసత్వ సవరణ చట్టంపై అపోహలు కలిగిస్తోందని మండిపడుతోంది. పార్లమెంటులో ఒక మాట, బయట ఒక మాట చెబుతున్న కేసీయార్ తీరుని బీజేపీ నేతలు ఎండగడుతున్నారు.2 పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురైన సీఎం కేసీఆర్.. ప్రజల దృష్టిని మార్చేందుకు మిడ్‌మానేరు సందర్శన చేపట్టారని బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. మిత్రపక్షమైన ఎంఐఎంతో దోస్తీ కొనసాగుతోందన్నారు. ఆ పార్టీ కోసమే సీఏఏను వ్యతిరేకించినట్లు ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ ఖాయమని కేసీఆర్ ముందే గుర్తించారని.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కరీంనగర్ పర్యటన మొదలు పెట్టారన్నారు. సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకించే ఎంఐఎం పార్టీ సభకు అనుమతిచ్చారని మండిపడ్డారు లక్ష్మణ్. అధికార టీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండానే మళ్ళీ మునిసిపల్ ఎన్నికలకు వెళ్లారన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో ఎదురైన అనుభవాలే టీఆర్ఎస్ కు ఈసారి ఎదురవుతాయన్నారు లక్ష్మణ్. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం.. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిందని, నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు వెలువడకపోవడం, నిరుద్యోగ భృతి అందని ద్రాక్షగా మారడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండిపడింది. నిరుద్యోగులకు పూటగడవడం కూడా కష్టంగా మారింది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోగా బడ్జెట్ లేదనే కారణంతో అందరికీ రుణాలు ఇవ్వడం లేదని లక్ష్మణ్ ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే చివరికి ఆ రుణాలు కూడా ఇవ్వకపోవడం యువత, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిదర్శనం అన్నారు. కవాడిగూడలో జరిగిన ఎన్నార్సీ, సీఏఏ అనుకూల ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. సీఏఏ చట్టం వల్ల ఎవరికీ అన్యాయం జరగదన్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
26 minutes ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
7 minutes ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
9 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
an hour ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
3 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
9 hours ago
ఇంకా