newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

అందరూ అగ్రనేతలే..! చేజారుతున్న క్యాడర్‌!!

15-11-201915-11-2019 08:38:01 IST
Updated On 15-11-2019 16:46:02 ISTUpdated On 15-11-20192019-11-15T03:08:01.371Z15-11-2019 2019-11-15T03:07:45.380Z - 2019-11-15T11:16:02.250Z - 15-11-2019

అందరూ అగ్రనేతలే..! చేజారుతున్న క్యాడర్‌!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతలు ఎక్కువ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు.. కానీ ప్రస్తుత పరిస్థితిల్లో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.. ఫలితంగా పార్టీ శ్రేణుల్లో తీవ్రనైరాశ్యం నెలకొంది.

పార్టీ కార్యక్రమాల్లో ఆ అగ్రనేతలు విస్తృతంగా పాల్గొనకపోవటం, క్యాడర్‌లో మనోధైర్యాన్ని నింపలేక పోతుండటంతో రోజురోజుకు పార్టీ క్యాడర్‌ చేజారిపోతుందనే వాదన వినిపిస్తుంది. 

ఇంతకీ అది ఏ జిల్లా.. అక్కడున్న రాష్ట్ర స్థాయి నేతలెవరా అనుకుంటున్నారా..? ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఒకప్పటి కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. ఈ జిల్లాలో కాంగ్రెస్‌ బలమైన శక్తిగా ఉంది.

ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతలు రాష్ట్ర స్థాయిలో కీలక భూమిక పోషించిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందనే వాదన వినిపిస్తుంది. దీంతో ముఖ్యనేతలకు చెందిన అనుచరులుసైతం టీఆర్‌ఎస్‌, బీజేపీల బాట పడుతున్నట్లు జిల్లాలో విస్తృతంగా చర్చసాగుతుంది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు ఉన్నారు. వీరి కనుసన్నల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పార్టీ కార్యకలాపాలు సాగుతుంటాయి.

అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో మంచి జోరుమీదన్న పార్టీ శ్రేణులు.. ఎన్నికల తరువాత తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. రెండవ సారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావటంతో పాటు జిల్లాలో పార్టీ ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఆ పార్టీలోని ద్వితీయశ్రేణి నేతల్లో స్తంబ్దత నెలకొంది.

పార్టీ అధికారంలోకి రాకపోవటంతో నైరాశ్యంలో ఉన్న శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేలా చేయాల్సిన అగ్రనేతలు.. నామమాత్రపు కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులను పూర్తిగా విస్మరించినట్లు వాదన వినిపిస్తుంది. అధికార పార్టీ నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకొని నిలబడేందుకు కూడా ఈ అగ్రనేతలు మనోధైర్యాన్ని ఇవ్వలేక పోతున్నారని ద్వితీయశ్రేణి నేతలు వాపోతున్నట్లు ప్రచారం సాగుతుంది.

ఎమ్మెల్సీ జీవనం రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌లు హైదరాబాద్‌ కేంద్రంగా విలేకరుల సమావేశాలు పెట్టడం తప్పితే జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమిటి, పార్టీ శ్రేణులు ఇబ్బందులను పట్టించుకోవటం లేదనే వాదన వినిపిస్తుంది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ తీరుకూడా అలానే ఉందని పార్టీ శ్రేణుల వాదన.

అగ్రనేతలు ఉన్న జిల్లాలోనే పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకపోవటంతో వారుసైతం బీజేపీ, టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ముఖ్యనేతల అనుచరులుసైతం బీజేపీ, టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది. కరీంనగర్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ విజయం సాధించటంతో పాటు.. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు బీజేపీవైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.

ఆ మున్సిపల్‌ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించే ప్రయత్నాలను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ముగ్గురు అగ్రనేతలు చేయకపోవటం ఆ పార్టీ క్యాడర్‌ను విస్మయానికి గురిచేస్తుందని ప్రచారం సాగుతుంది. మరి ఇప్పటికైనా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌లోని అగ్రనేతలు పార్టీ పటిష్ఠతపై ఏమేరకు దృష్టిసారిస్తారు. పార్టీ క్యాడర్‌ను ఏ విధంగా కాపాడుకుంటారో వేచి చూడాల్సిందే.

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   5 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   8 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   12 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle