newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అందరి చూపు 19న క్యాబినెట్ మీదే.. కేసీఆర్ ఏం చెప్పనున్నారు?

17-04-202017-04-2020 18:30:41 IST
Updated On 17-04-2020 18:41:57 ISTUpdated On 17-04-20202020-04-17T13:00:41.136Z17-04-2020 2020-04-17T13:00:38.701Z - 2020-04-17T13:11:57.672Z - 17-04-2020

అందరి చూపు 19న క్యాబినెట్ మీదే.. కేసీఆర్ ఏం చెప్పనున్నారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు వందలకు చేరిపోయింది. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో కరోనా ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోనే ఉందని చెప్తుంది. దీనికి కారణం ప్రస్తుతం సామజిక వ్యాప్తి ద్వారా వస్తున్నకేసులన్నీ ఇంతకు ముందు పాజిటివ్ కేసులు నమోదలైన ప్రాంతాలే కావడమే.

ఇప్పటికే ఆ ప్రాంతాలను రెడ్ జోన్లుగా.. హాట్ స్పాట్లుగా.. కంటోన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి పటిష్ట చర్యలు, రసాయనాలతో శానిటైజ్ చేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆయా ప్రాంతాల నుండి పక్క ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ చర్యలకు దిగింది. దీంతో ఇప్పటి వరకు కొత్త ప్రాంతాలలో సామజిక వ్యాప్తి ద్వారా వైరస్ వ్యాప్తి లేకపోవడమే ప్రభుత్వం కంట్రోల్ లోనే ఉందని చెప్పడానికి కారణం.

ఈక్రమంలోనే ఈనెల 20 తర్వాత లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నెలాఖరు వరకు విధించగా ఈనెల 20 తర్వాత చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ అప్పుడే చెప్పారు. ఇక కేంద్రం వచ్చేనెల 3 వరకు లాక్ డౌన్ విధించగా ఈనెల 20 నుండి కొన్ని సడలింపులు ఇచ్చింది.

ఈక్రమంలో రాష్ట్రంలో 20 తర్వాత పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఇరవైకి ఒక రోజు ముందు ఆదివారం రోజు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితి? ఇరవై నుండి పొడగించాలా వద్దా? సడలింపులు ఇస్తే ఏ రంగం నుండి ఉంటుంది? లేక కేంద్రం మార్గదర్శకం ప్రకారం వచ్చేనెల 3 వరకు కొనసాగించాలా అన్నది చర్చించనున్నారు.

దీంతో ఇప్పుడు రాష్ట్రంలో అందరి చూపు ఆదివారం జరిగే క్యాబినెట్ సమావేశంపై పడింది. కేంద్రం ఇప్పటికే ఏప్రిల్ 20 నుంచి కాస్త సడలింపులు ఇచ్చి వివిధ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగించుకునేలా వెసులుబాటు కల్పించింది. 50 శాతం మానవ వనరులతో కార్యకలాపాలు కొనసాగించుకొనేలా మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈక్రమంలోనే 20 నుండి రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలు పనులకు సిద్ధమవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ కంపెనీలలో కూడా ఆదివారం క్యాబినెట్ నిర్ణయం ఏమిటి? సీఎం కేసీఆర్ ఏం చెప్పనున్నారు? అన్నదానిపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో చాలా కంపెనీలు హాట్ స్పాట్లలో ఉన్నాయి.

నగరంలో కంటోన్మెంట్లుగా పేర్కొన్న ప్రాంతాలలో వివిధ ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఉన్నాయి. నగరంలో ఐటీ ప్రాంతాలలో ఒకటైన శేరిలింగంపల్లిలో 16 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన సడలింపు మార్గదర్శకాల ప్రకారం ఈనెల 20 నుండి ఇక్కడ పనిచేసుకోవచ్చు. ఇలా రాష్ట్రంలో హాట్ స్పాట్లలో చాలా కంపెనీలు ఉన్నాయి. వీటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందన్నది ఆసక్తిగా మారింది.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   9 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle