newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

అందరి చూపు అటువైపే.. సకలజనుల సమర భేరికి రెడీ

30-10-201930-10-2019 13:45:50 IST
Updated On 30-10-2019 18:14:06 ISTUpdated On 30-10-20192019-10-30T08:15:50.012Z30-10-2019 2019-10-30T08:15:47.887Z - 2019-10-30T12:44:06.275Z - 30-10-2019

అందరి చూపు అటువైపే.. సకలజనుల సమర భేరికి రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
26 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ముందే ప్రకటించినట్టు బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరూర్ నగర్లోని స్టేడియంలో సకలజనుల సమరభేరి సభను జరపబోతోంది. ఆర్టీసీసమ్మె పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని ఈసభ ద్వారా ఎండగట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ సభ జరగకుండా చూడాలని ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ కార్మికులు హైకోర్టును ఆశ్రయించడంతో సరూర్ నగర్లో సభకు అనుమతి ఇచ్చింది. సకల జనుల సమరభేరి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకే అనుమతి లభించింది.

సభ ముగిసిన తర్వాత రాత్రి 7 గంటల వరకు సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని కోర్టు షరతులు విధించడంతో కార్మికులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఈ సభకు కనీసం ఐదు లక్షలమంది హాజరు కాబోతున్నట్టు సమాచారం. భారీ ఎత్తున సభను నిర్వహించి.. తమ డిమాండ్లు ప్రజలకు తెలిసేలా చేయాలని జేఏసీ భావిస్తోంది. కార్మికులు ఎవరినీ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయకూడదని పోలీసులు షరతులు విధించారు. 

చినజీయర్ స్వామిని కలిసిన ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించేలా కేసీఆర్ ను ఒప్పించాలని ఆయనను కోరారు. ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామిని కలిసిన కార్మికులు సమ్మె చేస్తున్న తీరుని స్వామీజీకి వివరించారు.

కార్మికుల గుండెపోట్లు, ఆత్మహత్యలను వివరించారు. గతంలోనూ రెవిన్యూ ఉద్యోగులు స్వామీజీని కలిశారు. అదే రూట్లో ఆర్టీసీ కార్మికులు కూడా కేసీఆర్ ఎవరి మాట వింటారో వారిని కలిశారు. కేసీఆర్ ని గెలిపించి తప్పు చేశామని, ముక్కు నేలకురాసి నిరసన తెలిపారు. నగరంలోని బీహెచ్ఇఎల్ డిపోకి చెందిన కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle