అందరికీ మాస్క్ లు ఫ్రీ... తెలుగు రాష్ట్రాల సీఎంల మరో నిర్ణయం
13-04-202013-04-2020 09:25:14 IST
Updated On 13-04-2020 10:03:11 ISTUpdated On 13-04-20202020-04-13T03:55:14.175Z13-04-2020 2020-04-13T03:31:03.410Z - 2020-04-13T04:33:11.704Z - 13-04-2020

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతోంది. దీంతో రెండు ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందించాయి. ఏపీలో పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ చేయాలని సీఎం వైయస్.జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి జగన్ ఆదేశాలు జారీచేశారు.5.3 కోట్ల మందికి ఒక్కొక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కులు అందచేయాలని సూచించారు. మాస్కులు ధరించడం వల్ల కొంత రక్షణ లభిస్తుందని, వీలైనంత త్వరగా వీటిని పంపిణీ చేయాలని పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలు, మూడో విడత ఇంటింటి సర్వే ఫలితాలు, కరోనా కేసుల సరళిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రాష్ట్రంలోని మొత్తం 1.47 కోట్ల కుటుంబాలకుగానూ శనివారం రాత్రి నాటికి 1.43 కోట్ల కుటుంబాల్లో మూడో విడత ఇంటింటి సర్వే పూర్తిచేశారు. అందులో భాగంగా 32,349 మందిని ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పరీక్షల కోసం వైద్యాధికారులకు నివేదించారు. వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్ ఉండాలని, ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కోవిడ్ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య శాఖ సిద్ధమవుతోంది. వైరస్ వ్యాప్తి, ఉధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాప్తిస్తున్న జోన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. మరోవైపు కరోనా ఫ్రీ తెలంగాణను చేసేందుకు కేసిఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలనీ నిర్ణయించింది. కోవిడ్ 19ను కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించింది. ఇళ్లలో ఉండేవారు కూడా వీటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మాస్కుల తయారీ, కొనుగోలు, పంపిణీ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పజెప్పింది. స్థానికంగా ఉన్న మహిళా సంఘాలతో మాస్కులు తయారు చేయించి.. ఒక్కో మాస్క్‌కు రూ. 15 చెల్లించి పంచాయతీలు, మున్సిపాలిటీలు వీటిని కొనుగోలు చేయనున్నాయి. ఇలా మొత్తంగా 3 కోట్లపైగా మాస్కులను తయారు చేయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీటి ధర రూ. 50 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. రికవరీ అయి డిశ్చార్జ్ అవుతున్నవారు అధికంగానే వున్నారు. ఐసోలేషన్ వార్డులు క్రమంగా ఖాళీ అవుతున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రి కరోనా నోడల్ సెంటర్లో శనివారం ఉదయం వరకు 295 పాజిటివ్ కేసులు ఉండగా, కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు మరో 250 మంది ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 29 పాజిటివ్ కేసులు ఉండగా, ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో మరో 10 మంది అనుమానితులు ఉన్నారు. కింగ్‌కోఠి జిల్లా ఆస్ప త్రిలో 12 పాజిటివ్ కేసులు ఉండగా, ఐసోలేషన్ వార్డులో మరో 74 మంది అనుమానితులు ఉన్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో 30 మంది అనుమానితులు ఉన్నారు. అందరికీ మాస్క్ లు పంపిణీ చేస్తే ఈ నెలాఖరునాటికి కరోనా అదుపులోకి రావడం అని సీఎం కేసీయార్ చెబుతున్నారు.

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
5 hours ago

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
6 hours ago

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!
3 hours ago

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు
6 hours ago

కూరలో కరవేపాకు అయిన బండి సంజయ్
39 minutes ago

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భవిష్యత్
7 hours ago

అబ్బో సమస్యలపై కూడా జగన్ ఫోకస్ చేస్తున్నారా
8 hours ago

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ
21 hours ago

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు
17-04-2021

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి
a day ago
ఇంకా