అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తనిఖీలు
23-03-202023-03-2020 13:52:09 IST
Updated On 23-03-2020 14:35:24 ISTUpdated On 23-03-20202020-03-23T08:22:09.292Z23-03-2020 2020-03-23T08:14:48.021Z - 2020-03-23T09:05:24.214Z - 23-03-2020

కరోనా మహమ్మారి వ్యాధిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా అంతర్రాష్ట బస్సు సర్వీసులను నియంత్రిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు కర్ణాటక నుంచి వస్తున్న వాహనాలను అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ జహీరాబాద్ వద్ద అడ్డుకుంటున్నారు. దీంతో సిబ్బందికి ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారికి వాగ్వివాదం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోకి అనుమతించేది లేదని చెబుతున్నారు పోలీసులు. అనుమతించిన వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి శానిటేషన్ తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత అనుమతిస్తున్నారు. వచ్చే వారి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే ముందుకు పోనిస్తున్నారు పోలీసులు. ఇటు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సరిహద్దులోకి వచ్చిన లారీలు, డీసీఎం వంటి వాహనాలను పక్కనే ఉన్న వెంచర్లో పార్కింగ్ ఏర్పాటు చేసి నిలిపారు కార్లను సైతం నిలిపివేశారు. మాదన్నపేట్ మార్కెట్ లో నిబంధనలు ఉల్లంఘించి యథేచ్చగా సంచరిస్తున్న నలుగురు విదేశీ యువకులను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే వారిని వైద్యాధికారులకు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తారు కలెక్టర్. సిరిసిల్లలో రోడ్లపైకి వస్తున్న ప్రజలను అదుపు చేయడానికి స్వయంగా రంగంలోకి దిగారు కలెక్టర్ కృష్ణభాస్కర్. రోడ్డు పై తిరుగుతున్న కార్లను, ఆటోలను పట్టుకొని పోలీసుల సాయంతో ఫైన్ విధిస్తున్నారు. ఇంట్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలి, లేదంటే చర్యలు తప్పవంటున్నారు కృష్ణ భాస్కర్. కరోనా నిర్మూలను కఠినచర్యలు తప్పవని, ప్రజలు సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వెంట తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. నేరడిగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 31 మార్చ్ వరకు రహదారిపై ఎలాంటి వాహనాలు తిరగరాదని పోలీసులు సూచించారు. కరోనా అరికట్టేందుకు లాక్ డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అని, పరిస్థితి తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలన్నారు ట్రైనీ ఐపీఎస్ అధికారి హర్షవర్థన్. ప్రజలను వాహనదారులను చేతులెత్తి నమస్కరించి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ కి పాటించిన క్రమశిక్షణ ప్రతి ఒక్కరం మరో పది రోజుల పాటు పాటిస్తే కరోనా వైరస్ ఆపద నుండి బయటపడతామని ఆయన అన్నారు. బాధ్యతగల పౌరులుగా క్రమశిక్షణతో ఉందామని మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని కరోనా వైరస్ బారి నుండి కాపాడుకుందామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా