newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.. పులి చర్మం స్వాధీనం

11-03-202011-03-2020 16:14:49 IST
2020-03-11T10:44:49.703Z11-03-2020 2020-03-11T10:44:12.148Z - - 11-04-2021

అంతర్రాష్ట్ర దొంగల ముఠా  గుట్టురట్టు.. పులి చర్మం స్వాధీనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నదీ పరీవాహక ప్రాంతాలలో తిరుగుతున్న పులులను చంపేస్తున్నారు. చంపేసిన పులుల చర్మాన్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి ముఠా గుట్టును రట్టుచేశారు రామగుండం పోలీసులు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో గత కొంత కాలంగా చిరుత సంచరిస్తోందని స్థానికులు సమాచారం అందించారు.దొంగల ముఠా పులిని వేటాడేందుకు పన్నాగం పన్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా మరుపల్లి గ్రామానికి చెందిన తిరుపతి, గంగారాం, తులసిరాం ముగ్గురు కలిసి పులిని వేటాడేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.

ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో చిరుత సంచారాన్ని గుర్తించిన ముగ్గురు దానిని చంపి చర్మాన్ని వొలిచారు. దాని చర్మాన్ని విక్రయించేందుకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం సమీపంలో తచ్చాడుతుండగా రామగుండం కమీషనరేట్ పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

గత నాలుగు నెలల క్రితం చెన్నూరు సమీపంలో బెంగాల్ టైగర్ ను చంపి చర్మాన్ని విక్రయిస్తున్న మాదిరిగానే చిరుత చర్మాన్ని విక్రయించేందుకు దుండగులు ప్రయత్నాలు చేసినట్లు రామగుండం సిపి సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట్ర నుంచి తరచుగా పులి చర్మాల విక్రయాల కోసం ముఠాలు వస్తున్నాయని తమకున్న పటిష్ట వ్యవస్థ కారణంగా నిందితులను పట్టుకోగలిగామని ఆయన తెలిపారు. నిందితుల వివరాలు మహారాష్ట్ర పోలీసులతో పాటు అటవీ అధికారులకు తెలియ చేసినట్లు పేర్కొన్నారు. పులి చర్మం అమ్మడం కాని, కొనడం కాని నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమీషనర్ తెలిపారు. 

 

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle