newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ISRO మాజీ సైంటిస్ట్ నారాయణన్‌కు ఊరట

27-12-201927-12-2019 16:33:27 IST
Updated On 28-12-2019 10:51:57 ISTUpdated On 28-12-20192019-12-27T11:03:27.681Z27-12-2019 2019-12-27T11:03:19.107Z - 2019-12-28T05:21:57.833Z - 28-12-2019

ISRO మాజీ సైంటిస్ట్ నారాయణన్‌కు ఊరట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి, వేధింపులకు గురైన ఇస్రో మాజీ సైంటిస్ట్ ఒకరికి భారీ ఊరట లభించింది. అంతేకాదు, ఆయనకు పెద్దమొత్తంలో పరిహారం కూడా లభించనుంది. 1994 ఇస్రోలో గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్.నంబి నారాయణన్‌ అరెస్ట్‌ చేశారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదిన తాజాగా తేలింది. ఇప్పుడు ఆయనకు క్లీన్‌చిట్‌ లభించింది. అంతేకాదు, తనను వేధించినందుకు నారాయణన్ భారీగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ తిరువనంతపురంలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నంబి నారాయణన్ పై వచ్చిన ఆరోపణలు, కేసులను విచారించడానికి మాజీ ప్రధాన కార్యదర్శి జయకుమార్‌ను నియమించింది. జయకుమార్‌ రూ.1.3 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని సిఫారసు చేశారు. దీంతో పరిహారం చెల్లింపునకు కేరళ కేబినెట్ ఆమోదం తెలపడంతో నంబి నారాయణన్ సంతోషం వ్యక్తం చేశారు. 1994లో నంబి నారాయణన్‌ పై గూఢచర్యం జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి. దీని ద్వారా విదేశాలకు ఇస్రో రహస్యాలను చేరవేశారంటూ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఇద్దరు శాస్త్రవేత్తలు, ఇద్దరు మాల్దీవ్‌ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆరోపణలపై 1998లో సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. కేసులో తీర్పు వచ్చేటప్పటికే నంబి నారాయణన్ 50 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. తనను కస్టడీలో పోలీసులు నానా ఇబ్బందులకు గురిచేశారని, వేధించారని ఫిర్యాదుచేశారు. తనపై అక్రమ కేసులు పెట్టిన మాజీ డీజీపీ సీబీ మాథ్యూస్, ఇద్దరు రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్లు కేకే జాషువా, ఎస్ విజయన్ పై చర్యలు తీసుకోవాలని కేరళ హైకోర్టుని కోరారు. 

అయితే హైకోర్టు స్పందించకపోవడంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీంతో నంబి నారాయణన్‌కు రూ. 50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సైతం రూ. 10లక్షలు ఇవ్వాలని తీర్పిచ్చింది. తాజాగా జయకుమార్ కమిటీ కోటి 30 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరడంతో కేరళ ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో విజయం సాధించిన నంబి నారాయణన్ కోర్టు తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle