newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

11-07-202011-07-2020 08:22:53 IST
Updated On 11-07-2020 08:41:43 ISTUpdated On 11-07-20202020-07-11T02:52:53.295Z11-07-2020 2020-07-11T02:52:17.875Z - 2020-07-11T03:11:43.431Z - 11-07-2020

5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రౌడీయిజం తీవ్రంగా ఉంటుంది. నేరాలు చాలా ఎక్కువ‌. గ్యాంగులు క‌ట్ట‌డం, దారి దోపిడీల‌కు పాల్ప‌డ‌టం, బెదిరింపులు, కిడ్నాప్‌లు, హ‌త్య‌లు, రేప్‌లు, ఇత‌ర అన్ని నేరాలూ ఆ రాష్ట్రంలో చాలా ఎక్కువ‌గా జ‌రిగేవి. అక్ర‌మ ఆయుధాలు విప‌రీతంగా ఉంటాయి. గ్రామాల్లోనూ నేరాలు ఎక్కువ‌.

ముఖ్యంగా రౌడీ గ్యాంగులు ఎక్కువ‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు, నేరాలు క‌లిసి ఉంటాయి. నేర‌స్తుల‌కు రాజ‌కీయ నేత‌ల మ‌ద్ద‌తు ఉంటుంది. రాజ‌కీయ నేత‌ల‌కు నేర‌స్తులు స‌హ‌క‌రిస్తుంటారు. అంతా క‌లిసి యూపీని గుండారాజ్యం చేసేశారు. తొండ ముదిరి ఊస‌ర‌వెల్లిలా మారిన‌ట్లు యూపీలో రౌడీలే రాజ‌కీయ నేత‌లుగా మార‌డం చాలా సాధార‌ణం.

స‌మాజ్‌వాదీ పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీల పాల‌న‌లో సుదీర్ఘ‌కాలం ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఆ రెండు పార్టీలూ రౌడీయిజాన్ని, నేరాల‌ను త‌గ్గించాల‌ని ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌లేదు. పైగా నేర‌స్థుల‌‌కు ఈ పార్టీల నేత‌ల‌తో సంబంధాలు ఉండేవి. దీంతో నేర‌స్థుల‌ను కంటికి రెప్ప‌లా నేత‌లే కాపాడుకుంటూ రౌడీయిజాన్ని ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప్రోత్స‌హించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  2017 మార్చిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స‌న్యాసి యోగి ఆధిత్య‌నాథ్‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై బీజేపీ కూర్చోబెట్టింది.

అంత పెద్ద రాష్ట్రానికి ప‌రిపాల‌నా అనుభ‌వం లేని యోగి పాలించ‌గ‌ల‌రా అనే అనుమానాలు చాలా మందికి వ‌చ్చాయి. అయితే, మిగ‌తా విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే నేరాల‌ను అదుపు చేయ‌డంలో మాత్రం యోగి స‌ర్కార్ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అవుతోంది. నేర‌స్తులు, గ్యాంగుల‌పై ఉక్కుపాదం మోపుతోంది. వంద‌ల సంఖ్య‌లో ఎన్‌కౌంట‌ర్లు చేస్తూ రౌడీల‌ను ఏరివేస్తోంది.

తాజాగా గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేను యూపీ పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. నిజానికి వారం క్రిత‌మే వికాస్‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌గా ఈ విష‌యం తెలిసి వికాస్ గ్యాంగ్ పోలీసులు రాగానే విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపి 8 మంది పోలీసు అధికారుల‌ను దారుణంగా హ‌త‌మార్చింది.

దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నేరాల‌పై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. తీవ్ర‌వాదులు, మావోయిస్టులు పోలీసుల‌ను బ‌లిగొన‌డ‌మే దేశంలో ఇంత‌వ‌ర‌కు జ‌రుగుతోంది. అటువంటి ఒక రౌడీ గ్యాంగ్ ఏకంగా 8 మంది పోలీసుల‌ను చంప‌డం సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఉత్త‌రప్ర‌దేశ్ పోలీసుల గురించి, యోగి ఆధిత్య‌నాథ్ స‌ర్కార్ గురించి తెలిసిన వారంతా వికాస్ దూబే ఇక రోజులు లెక్క బొట్టెకోవాల్సిందే అని అనుకున్నారు. అనుకున్న‌ట్లుగానే వికాస్‌ను ఎన్‌కౌంట‌ర్ చేశారు యూపీ పోలీసులు.

దీంతో మ‌రోసారి యోగి స‌ర్కార్ ఎన్‌కౌంట‌ర్ల‌పై, నేర‌స్తుల ఏరివేత‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఆరునెల‌ల క్రితం హైద‌రాబాద్‌లో దిశ హంత‌కుల ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి యూపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. యూపీలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోతోంద‌ని, నేర‌స్తుల‌ను అతిథులుగా ప్ర‌భుత్వం చూసుకుంటోంద‌ని, యూపీ పోలీసులు హైద‌రాబాద్ పోలీసుల నుంచి స్ఫూర్తి పొందాల‌ని వ్యాఖ్యానించారు. ఈ విమ‌ర్శ‌ల‌కు ఉత్త‌ర ప్ర‌దేశ్ పోలీసు శాఖ లెక్క‌లతో స‌హా స‌మాధానం చెప్పి తిప్పికొట్టారు.

యూపీ పోలీసు శాఖ అధికారికంగా అప్పుడు చెప్పిన లెక్క‌ల ప్ర‌కార‌మే యోగి ఆధిత్య‌నాథ్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఏకంగా 5,178 ఎన్‌కౌంట‌ర్లు చేసింది. ఈ ఎన్‌కౌంట‌ర్ల‌లో 103 మంది నేర‌స్థుల‌ను పోలీసులు హ‌త‌మార్చారు. 1,859 మంది నేర‌స్థులు ఎన్‌కౌంట‌ర్ల‌లో గాయ‌ప‌డ్డారు. ఈ ఎన్‌కౌంట‌ర్ల‌కు భ‌య‌ప‌డి 17,745 మంది నేర‌స్థుల‌కు పోలీసుల‌కు లొంగిపోయారు.

కొంద‌రు బెయిళ్లు ర‌ద్దు చేయించుకొని జైళ్ల‌కు వెళ్లిపోయారు. అంత‌లా యోగి ఆధిత్యనాథ్ ప్ర‌భుత్వం నేర‌స్థుల‌పై ఉక్కుపాదం మోపుతోంది. అయితే, కొన్ని ఫేక్ ఎన్‌కౌంట‌ర్ల‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆరోప‌ణ‌లు ప‌క్క‌న‌పెడితే యోగి ఆధిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నేరాల‌ను బాగానే అదుపు చేస్తోంది. తాజా ఘ‌ట‌న‌తో ఇది మ‌రోసారి నిరూపిత‌మైంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle