newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

21రోజుల లాక్ డౌన్.. పాటించాల్సిన నిబంధనలివే

25-03-202025-03-2020 08:56:41 IST
2020-03-25T03:26:41.693Z25-03-2020 2020-03-25T03:21:45.837Z - - 14-04-2021

21రోజుల లాక్ డౌన్.. పాటించాల్సిన నిబంధనలివే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలో స్పష్టమైన నిబంధనలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్ డీఎంఏ)కు అధికారాలు కట్టబెడుతూ ఉత్తర్వులతో పాటు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అవి ఇలా ఉన్నాయి.

రక్షణ, కేంద్ర పారా మిలిటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్వతంత్ర వ్యవస్థలను మూసివేయాలి. రాష్ట్రాల్లో పోలీసు, హోం గార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాపక, అత్యవసర సేవలు, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, నీటి సరఫరా మినహా అన్ని సేవలు బంద్ చేశారు.

ఆసుపత్రి, అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్ లు, అంబులెన్సులు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపల దుకాణాలు తెరిచి ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు స్థానిక పాలన యంత్రాంగం నిత్య అవసరాలను ఇళ్లకే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలి. బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటీఎంలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ వ్యవస్థలు, కేబుల్ సేవలు కొనసాగుతాయి.

ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు ఈ- కామర్స్ ద్వారా సరఫరా చేసే వారికి మినహాయింపు ఇచ్చారు. పెట్రోల్ పంపు, గ్యాస్ కేంద్రాలు యథావిధిగా నడుస్తాయి. క్షేత్ర స్థాయిలో విద్యుత్ రంగ సేవల్లో పనిచేసే వారికి మినహాయింపు ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ లు, గిడ్డంగులు, నిత్యావసరాల తయారీ యూనిట్లు, ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు మినహాయింపులు ఇచ్చారు. ఇతర ఉత్పత్తుల సంస్థలు విధిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.

అత్యవసర రవాణా సేవలు మినహా మిగిలిన రవాణా వ్యవస్థలన్నీ నిలిపివేత. అన్ని విద్యా, పరిశోధన, శిక్షణ సంస్థలన్నీ మూసివేయాల్సి ఉంటుంది. అన్ని మత సంబంధిత స్థలాలు మూసివేయాలి. మత పరమైన కార్యక్రమాలకు ఎటువంటి మినహాయింపులు లేవు. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు.ఫిబ్రవరి 15 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా అధికారుల సూచన మేరకు వ్యవహరించాలి. అధికారులు సూచించిన విధంగా ఇంటికి కానీ లేదా నిర్బంధ కేంద్రాలకు పరిమితమవ్వాలి. ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు చేసే సూచనలను పౌరులు పాటించాలి.

సామాజిక దూరం కొనసాగించాలి. అన్ని సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.స్థానికంగా ఈ నిబంధనలను అమలు చేసే వారు మినహాయింపులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలి. ఈ అర్ధరాత్రి నుంచి నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. 21 రోజుల పాటు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందే. జిల్లా న్యాయాధికారి కమాండర్ గా వ్యవహరిస్తూ నిబంధనలన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూడాలి. ఉల్లంఘనలకు కమాండర్ లే బాధ్యులు అవుతారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు. ఈ నిబంధనలు పాటిద్దాం.. అంతా సురక్షితంగా ఉందాం. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle