newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

2022లోనే జమిలి? 2025లో మోడీ రిటైర్మెంట్?

12-09-201912-09-2019 08:19:02 IST
2019-09-12T02:49:02.883Z12-09-2019 2019-09-12T02:48:26.587Z - - 20-04-2021

2022లోనే జమిలి? 2025లో  మోడీ రిటైర్మెంట్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల సందడి ప్రారంభమయింది. ఎన్నికలు ముగిసి ఆరునెలలు కూడా కాలేదు. దేశంలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను భారతీయ జనతా పార్టీ మళ్ళీ తెరమీదకు తెస్తోంది.

కానీ ఈ ఆలోచన ఇప్పటిది కాదని తెలుస్తోంది. 2014 ఎన్నికలు ముగిసి, మోడీ ప్రధాని అయ్యాక ఈ ప్రతిపాదనను  వారు ఎన్నికల కమిషన్ ముందు పెట్టి.. ఈ విషయంలో వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక ఇతర పార్టీలు కూడా మోడీ నిర్ణయం పట్ల అంత సానుకూలంగా స్పందించలేదు. అప్పట్లో దీనిపై ఎన్డీయే సర్కార్ అంతగా వత్తిడి చేయలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. అప్పుడు మోడీకి ఇంత మెజారిటీ లేదు. వరుసగా రెండోసారి ప్రధాని అయ్యాకా ఆయనకు సహజంగానే శక్తి మరింతగా పెరిగింది. 

ఈ నేపథ్యంలో ఒకదేశం - ఒకే ఎన్నిక అనే సూత్రాన్ని అమలు పెట్టాలని మోడీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అదంతా సాధ్యమయ్యే ప్రక్రియేనా? అనేది మాత్రం ఇంకా ఎవరికీ స్పష్టత లేదని అంశం. దాని కోసం చాలా కసరత్తే చేయాల్సి ఉంటుంది. అంతలోనే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 

ఒకవైపు ఎన్నికలు నిర్వహించుకుంటూ పోతూ ఉంటే మరోవైపు ఒక దేశం - ఒకే ఎన్నికలు అనడం కేవలం నినాదంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాదే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రతి ఏటా కొన్నింటికి ఎన్నికలు తప్పవు. వాటి విషయంలో ఎలా డీల్ చేస్తారనేది.. ఒకేసారి దేశమంతా ఎన్నికలను నిర్వహించడం మీద ఆధారపడి ఉంటుంది.

మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. 75 ఏళ్ళ వయసులో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అనే  నియమాన్ని కూడా మోడీ అమలు చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది సీనియర్లను ఆకారణం వల్లే టికెట్లు నిరాకరించారు. అద్వానీ వంటివారికి టికెట్లు ఇవ్వకుండా వారి వారసులకు టికెట్లు ఇవ్వాలని భావించారు.

ఈ నేపథ్యంలో మోడీ కూడా ఆ నియమాన్ని తు.చ తప్పకుండా పాటిస్తారని.. 2025 నాటికి తనకు డెబ్బై ఐదేళ్ల వయసు మీద పడగానే.. ఆయన రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తప్పుకుంటారని కూడా  బీజేపీ వర్గాలు అంటున్నాయి. 

మోడీ రిటైర్మెంట్ జరిగేందుకు ముందే మరోసారి ఎన్నికలు పూర్తయి, మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించి చరిత్ర సృష్టించనున్నారు. ఈ చరిత్రను మళ్ళీ తిరగరాసే అవకాశం లేకుండా ఆయన మరొకరికి పగ్గాలు అప్పగించి హాయిగా రెస్ట్ తీసుకుంటారని, ప్రభుత్వానికి తనవంతు సలహాలు ఇస్తూ ముందుకు సాగుతారని అంటున్నారు. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle