newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

2020 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

01-02-202001-02-2020 11:56:08 IST
Updated On 01-02-2020 12:36:12 ISTUpdated On 01-02-20202020-02-01T06:26:08.683Z01-02-2020 2020-02-01T06:26:05.937Z - 2020-02-01T07:06:12.194Z - 01-02-2020

2020 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ పద్దు పార్లమెంటుకి వచ్చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.  నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. 

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం 

పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. 

బడ్జెట్ ముఖ్యాంశాలు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో మూడు ప్రాధాన్యతాంశాలను ప్రస్తావించడం విశేషం.

తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి

ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు

మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమంకి ఇచ్చారు.

ప్రధాని మోడీ ముందే చెప్పినట్టుగా పేదల సంక్షేమాన్ని ప్రాధాన్యతాంశంగా చేర్చారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్‌ లక్ష్యం అన్నారు ఆర్థికమంత్రి. రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు అమలుచేస్తామన్నారు. 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలతో పాటు 26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు అందిస్తామన్నారు. దేశంలో పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చామని చెప్పిన ఆర్థికమంత్రి ఇక నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌ మరింత సులభతరం చేస్తాం అన్నారు. ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలుచేశామన్నారు. 

జీఎస్టీ అమలు వల్ల దేశంలో ప్రజలపై పన్నుల భారం తగ్గిందన్నారు. జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరారని, రూ లక్ష కోట‍్ల వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లించామన్నారు. 40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలు కావడం విశేషం అన్నారు ఆర్థికమంత్రి. జీఎస్టీ సమస్యల పరిష్కారానికి జీఎస్టీ మండలి చొరవ చూసుతోందని, జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయన్నారు. జీఎస్టీ చారిత్రాత్మకమయిన నిర్ణయం అని కొనియాడారు మంత్రి నిర్మలా సీతారామన్. 

ఎకానమీని సంఘటితపరిచేందుకు చర్యలు చేపట్టామని, ఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టిందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. ఈ బడ్జెట్‌ దేశ ప్రజల ఆర్థిక స్థోమతను పెంచుతుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, భారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. 

చదవండి : నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతోంది?

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   18 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle