newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

2018లో 71 శాతం.. 2019లో 40 శాతం..!

27-11-201927-11-2019 07:48:40 IST
Updated On 27-11-2019 16:21:45 ISTUpdated On 27-11-20192019-11-27T02:18:40.874Z27-11-2019 2019-11-27T02:18:17.856Z - 2019-11-27T10:51:45.961Z - 27-11-2019

2018లో 71 శాతం.. 2019లో 40 శాతం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశాన్ని కాషాయ‌మ‌యం చేయాల‌ని, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండాను ఎగ‌రేయాల‌ని క‌ల‌లు కంటున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌ల నెర‌వేరేలా లేదు. ఆ పార్టీ చేతి నుంచి ఒక్కో రాష్ట్రం చేజారి పోతోంది. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లోనూ అధికారానికి దూరం కావ‌డం బీజేపీకి ఊహించ‌ని ప‌రిణామం. మ‌రోవైపు కాంగ్రెస్ ముక్త్ భార‌త్ చేయాల‌నుకునే బీజేపీ ప్ర‌య‌త్నాలు కూడా విఫ‌ల‌మ‌వుతున్నాయి.

2014లో న‌రేంద్ర మోడీ - అమిత్ షా శ‌కం బీజేపీలో ప్రారంభం కాక ముందు ఆ పార్టీ దేశంలోని కేవ‌లం ఏడు రాష్ట్రాల్లో మాత్ర‌మే అధికారంలో ఉండేది.

13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఉండేవి. ఒక‌సారి న‌రేంద్ర మోడీ హ‌వా మొద‌ల‌య్యాక ఆ పార్టీ దేశ‌వ్యాప్తంగా తిరుగులేని శ‌క్తిగా మారింది. ద‌క్షిణాది మిన‌హా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ స‌త్తా చాటింది. ఏ మాత్రం బ‌లం లేని ఈశాన్య భార‌తంలో కాషాయ జెండా ఎగ‌రేసింది.

దీంతో 2018 డిసెంబ‌ర్ నాటికి ఏకంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. దేశ భూభాగంలోని 71 శాతం బీజేపీ చేతిలో ఉంది. 2015లో బీజేపీ 13 రాష్ట్రాల్లో, 2016లో 15 రాష్ట్రాల్లో, 2017లో 19 రాష్ట్రాల్లో, 2018 నాటికి 21 రాష్ట్రాల్లో అధికారాన్ని చేప‌ట్ట‌గ‌లిగింది.

ఇందులో పూర్తిస్థాయి బ‌లం లేక‌పోయినా ఫిరాయింపులు, ఎన్నిక‌ల త‌ర్వాత పొత్తులు పెట్టుకొని చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చింది ఆ పార్టీ. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పూర్తిగా ప‌ట్టు కోల్పోయింది. కేవ‌లం 3 రాష్ట్రాల‌కే ఆ పార్టీ ప‌రిమిత‌మైంది.

కానీ, త‌ర్వాత క్ర‌మంగా బీజేపీ చేతి లోంచి ఒక్కో రాష్ట్రం జారిపోతోంది. బీజేపీతో టీడీపీ తెగ‌దింపులు చేసుకోవ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్ట‌డంతో జ‌మ్ము క‌శ్మీర్‌లో మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి ద‌క్కించుకున్న అధికారం కోల్పోయింది ఆ పార్టీ. త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి కంచుకోట‌లుగా ఉన్న రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌ల‌లో ఆ పార్టీ ఓడిపోగా కాంగ్రెస్ గెలిచింది. క‌ర్నాట‌క‌లో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించినా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేక‌పోయింది.

కానీ, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మ‌ళ్లీ బీజేపీ హ‌వా మొద‌లైంద‌ని అంతా అనుకున్నారు. క‌ర్నాట‌క‌లో త‌మ రాజ‌కీయ వ్యూహాల‌తో ప్ర‌భుత్వాన్ని దించేసి అధికారంలోకి వ‌చ్చింది బీజేపీ.

త‌ర్వాత హ‌ర్యానాలోనూ మేజిక్ ఫిగ‌ర్ రాక‌పోయినా ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొని అధికారంలోకి రాగ‌లిగింది. అయితే, మ‌హారాష్ట్ర‌లో మాత్రం ఆ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. మిత్ర‌పక్షం శివ‌సేన‌తో ప‌డ‌క‌పోవ‌డంతో బీజేపీ అధికారానికి దూర‌మైంది.

ప్ర‌స్తుతం బీజేపీ, ఆ పార్టీ మిత్ర‌ప‌క్షాలు 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. సంఖ్యాప‌రంగా ఇది ప‌ర్వాలేకున్నా దేశ‌విస్తీర్ణాన్ని చూసుకుంటే మాత్రం బీజేపీ పాలిట రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉన్న‌ది చాలా త‌క్కువ విస్తీర్ణంలోనే. ద‌క్షిణ భార‌త్‌లో కేవ‌లం క‌ర్ణాట‌క‌లో మాత్ర‌మే ఆ పార్టీ అధికారంలో ఉంది.

కీల‌క‌మైన‌, విస్తీర్ణం ప‌రంగా పెద్ద రాష్ట్రాలుగా ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌హారాష్ట్ర‌, ఏపీ, తెలంగాణ‌, కేర‌ళ‌, పంజాబ్‌, త‌మిళ‌నాడు, ఒడిశా, చ‌త్తీస్‌ఘ‌డ్‌ల‌లో బీజేపీ అధికారంలో లేదు.

దీంతో ప్రస్తుతం కేవ‌లం దేశంలోని 40 శాతం విస్తీర్ణంలోని రాష్ట్రాలే బీజేపీ చేతిలో ఉన్నాయి. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రిస్తున్న బీజేపీకి, మోడీ - షా ధ్వ‌యానికి రాష్ట్రాల్లో మాత్రం ఫ‌లితాలు రుచించ‌డం లేదు. దీంతో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగ‌రేయాల‌నే బీజేపీ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరే అవ‌కాశ‌మే లేదు.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle