20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ
12-05-202012-05-2020 20:33:13 IST
Updated On 13-05-2020 11:02:40 ISTUpdated On 13-05-20202020-05-12T15:03:13.053Z12-05-2020 2020-05-12T15:01:09.365Z - 2020-05-13T05:32:40.344Z - 13-05-2020

లాక్ డౌన్ 3.O ముగుస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ దేశ జీడీపీ దాదాపు 10శాతం ఉంటుంది. ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్ధిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుంది. కరోనాపై పోరులో నాలుగునెలలకు పైగా సమయం గడిచిపోయింది.. భారత్‌లో కూడా అనేకమంది అయినవారిని కోల్పోయారు. ఒకేఒక్క వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. మన పోరాట సంకల్పాన్ని మరింతగా బలపరుచుకోవాలి’ఇంత పెద్ద ఆపద భారత్‌కు ఒక సందేశాన్ని తీసుకు వచ్చింది. ఒక అవసరాన్ని కూడా తీసుకొని వచ్చింది. ఈ సంక్షోభం ప్రారంభమయ్యేసరికి దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారు కావటం లేదు. ఇప్పుడు దేశంలో రెండు లక్షలపైగా పీపీఈ కిట్లు తయారయ్యాయి.ఇప్పుడు పీపీఈ కిట్లు, మాస్కులు తయారీ ద్వారా స్వయం సమృద్ధి సాధించాం. ఇవాళ ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉంది. మనం మరింత నిబ్బరంగా ఉండాలి’’. ‘‘ఆత్మనిబ్బర భారత్ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షలమందికిపైగా కరోనా బాధితులు ఉన్నారు. ఈ వైరస్ కారణంగా 2.75 లక్షలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కూడా చాలామంది అయినవారిని కోల్పోయారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ దేశ జీడీపీ దాదాపు 10శాతం ఉంటుంది. ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్ధిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుంది. లాక్ డౌన్ 4.O వుంటుందని కొత్త నిబంధనలు అమలుచేస్తామన్నారు ప్రధాని మోడీ. అరగంట పాటు ప్రసంగించిన మోడీ కీలకమయిన ప్రకటనలు చేశారు. మేడిన్ ఇండియా ప్రొడక్ట్ లు ప్రోత్సహించాలని దేశీయ ఉత్పత్తులను వాడాలన్నారు మోడీ. ఇవాళ మనం తీసుకుంటున్న చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామన్నారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ఈ ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు. మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఈ ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుంది. రేపట్నుంచి ఆత్మ నిర్బర్ అభియాన్‌పై ఆర్థికమంత్రి వివరాలు అందిస్తారని మోదీ చెప్పారు. ఈనెల 18 నుంచి కొత్త లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. కరోనా వైరస్ మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది అన్నారు.భారత సంస్కృతి, సాంప్రదాయం మన స్వయం సంవృద్ది గురించి చెబుతాయన్నారు మోడీ. మొత్తం ప్రపంచాన్ని కుటుంబంగా చూసే సంస్కృతి మనది. ఈ భూమిని తల్లిగా భావించే ఆలోచన ఈ దేశానిది. అలాంటి మన దేశం స్వయం సంవృద్ది వైపు సాగితే. దీని ప్రభావం మొత్తం ప్రపంచానికి శుభపరిణామం అన్నారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనేక సమస్యలను తీసుకువచ్చారు. ఇక లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి. ఇక నాలువసారి లాక్ డౌన్ ఎలా వుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా