2వేల నోటుకి కాలం చెల్లిందా? ఆర్బీఐ ఏమంటోంది?
26-08-202026-08-2020 10:13:31 IST
2020-08-26T04:43:31.890Z26-08-2020 2020-08-26T04:43:15.740Z - - 11-04-2021

నోట్లరద్దు తర్వాత 500, 1000 నోట్లను కాదని కేంద్రం 2 వేల నోటు తీసుకువచ్చింది రిజర్వుబ్యాంక్. పెద్ద నోట్ల వల్ల మళ్ళీ నల్లధనం పెరిగిపోతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్రం 2వేల నోట్లను క్రమేపీ తగ్గించాలని భావించింది. దేశంలో రూ. 2,000 నోట్లను 2019–20 ఆర్థిక సంవత్సరంలో అసలు ముద్రించనే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక తెలిపింది. గత కొద్ది సంవత్సరాలుగా అసలు ఈ నోట్ల సర్క్యులేషన్ కూడా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ మోసాలు రెట్టింపు, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 ప్రభావం, వ్యవస్థలో డిమాండ్, దేశాభివృద్ధి వంటి కీలక అంశాలను 2019–20 వార్షిక నివేదిక అనేక విషయాలు వెల్లడించింది. ఏటీయంలలో కూడా 2వేల నోట్లు చాలాకాలం నుంచి రావడంలేదు. 2019 మార్చి చివరినాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్ల సంఖ్య 33,632 లక్షలుగా వుంది. 2019 మార్చి నాటికి ఈ సంఖ్య 32,910 లక్షలకు తగ్గింది. 2020 మార్చి నాటికి మరింతగా 27,398 లక్షలకు పడిపోయింది. 2020 మార్చి చివరినాటికి మొత్తం నోట్ల పరిమాణంలో రూ.2,000 నోట్లు 2.4 శాతంగా తగ్గిపోయాయి. 2018 మార్చి ముగిసేనాటికి ఇది 3.3 శాతం ఉంటే, 2019 మార్చి నాటికి 3 శాతానికి దిగివచ్చింది. మొత్తం నోట్ల విలువలో వీటి వాటా 2018 మార్చి నాటికి 37.3 శాతం వుంది. అయితే 2019 మార్చి నాటికి 31.2 శాతానికి 2020 మార్చి నాటికి మరింతగా 22.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది 2వేల నోట్ల సంఖ్య భారీగా పడిపోనుంది. 2వేల నోటు ప్రభావం తగ్గడంతో సర్క్యులేషన్లో మిగతా నోట్లు పెరిగాయి. ఏటీఎంలు, బ్యాంకులలో కష్టమర్లు రూ500, రూ.200 నోట్ల కరెన్సీ నోట్లను అందుబాటులో వుంచారు. 2వేల నోట్లు కావాలంటే బ్యాంకుల నుంచి ఇండెంట్ రావడం లేదు. దేశంలో నకిలీ నోట్ల సంఖ్య 2,96,695గా వుంది. 2018–19లో గుర్తించిన రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 21,847 అయితే 2019–20లో ఈ సంఖ్య 17,020కి తగ్గింది. రాబోయే రోజుల్లో 2వేల నోటుని రద్దుచేస్తారనే వదంతులు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ప్రభుత్వం ఖండిస్తూనే వుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం నుంచి 2 వేల నోటు తగ్గించాలని ఉత్తర్వులు వచ్చాయని, , ఏటీఎంలలో రూ.2వేల నోట్లు పెట్టొద్దని, వాటి స్థానంలో రూ.100 నోట్లను ఉంచాలని ఆదేశాలు జారీ అయినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జాతీయ మీడియాలో రిపోర్టులు వచ్చాయి. అయితే వీటిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. గతేడాది అక్టోబర్ నుంచి రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపేశామని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలో ఈ పెద్దనోటుకి సెండాఫ్ చెప్పడం ఖాయంగా చెబుతున్నారు. కాబట్టి మీ దగ్గర 2వేల నోట్లు వుంటే వెంటనే మార్చేసుకోండి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
14 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
16 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా