newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

19న రాజ్యసభ ఎన్నికలు..18 సీట్లకు పోలింగ్

01-06-202001-06-2020 18:52:46 IST
Updated On 02-06-2020 09:36:22 ISTUpdated On 02-06-20202020-06-01T13:22:46.484Z01-06-2020 2020-06-01T13:22:34.594Z - 2020-06-02T04:06:22.411Z - 02-06-2020

19న రాజ్యసభ ఎన్నికలు..18 సీట్లకు పోలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలను జూన్ 19న నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈసారి 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అధికార వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి బరిలో ఉన్నారు. 

కాగా, ఏపీలోని నాలుగు స్థానాలతో పాటు గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 3, ఝార్ఖండ్ లో 2, మణిపూర్ లో 1, మేఘాలయలో 1 స్థానాలకు ఎన్నికలు జరుపుతారు. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 

కరోనా కల్లోలం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ సీట్ల కోసం ఫిబ్రవరి 25న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో అప్పటికే 37 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మిగిలిన 18 స్థానాలకు మార్చి 26న పోలింగ్ జరగాల్సి ఉంది. తెలంగాణలో ఖాళీ అయిన రెండు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. ఏపీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. 

ఏపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కే కేశవరావు, ఏకే ఖాన్, టి సుబ్బిరామిరెడ్డి, సీతారామ లక్ష్మి కాల పరమితి ముగిసింది. వీరి స్థానంలో ప్రస్తుతం ఏపీ శాసనసభలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. అయితే, ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ సైతం అనూహ్యంగా తమ అభ్యర్దిని బరిలోకి దింపింది. వర్ల రామయ్య టీడీపీ నుండి నామినేషన్ దాఖలు చేసారు. ఇక, వైసీపీ నుండి అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్, పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ నామినేషన్లు వేసారు. సంఖ్యా పరంగా రాజ్యసభ సమావేశానికి ఎటువంటి ఇబ్బంది లేకపోవటంతో కరోనా ప్రభావం కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   35 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle