newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

17వ లోక్ సభ స్పీకర్ ఎవరు?

05-06-201905-06-2019 13:36:26 IST
Updated On 24-06-2019 16:17:12 ISTUpdated On 24-06-20192019-06-05T08:06:26.743Z05-06-2019 2019-06-05T08:05:50.719Z - 2019-06-24T10:47:12.956Z - 24-06-2019

17వ లోక్ సభ స్పీకర్ ఎవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఈసారి 17వ లోక్‌సభను నడిపేది ఎవరు?  స్పీకర్‌గా ఎవరు వ్యవహరించనున్నారనే దానిపై అనేక వార్తలు వస్తున్నాయి. ఈ పదవి కోసం పలువురు బీజేపీ ఎంపీలు పోటీపడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, రాధామోహన్‌ సింగ్‌, వీరేంద్ర కుమార్‌ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జువాల్‌ ఒరామ్‌, ఎస్‌.ఎస్‌.అహ్లూవాలియా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అనుభవంతో ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించనున్న మేనకా గాంధీకే తదుపరి స్పీకర్‌ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

ఈసారి కూడా మహిళానేతే ఉండొచ్చని అంటున్నారు. మేనకాగాంధీతో పాటు  ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికైన రాధామోహన్‌ సింగ్‌ కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వివాదరహితుడిగా పేరుండడంతో పాటు పార్టీలో మంచి పట్టుండడం ఆయనకు కలిసి రావచ్చు. వీరేంద్ర కుమార్ కూడా ఆరు సార్లు సభకు ఎన్నిక కావడంతో పాటు దళిత నేత కావడం కూడా కలిసి రావచ్చని చెబుతున్నారు. 

అయితే దక్షిణాదికి చెందిన వ్యక్తిని స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టి అందరి అంచనాలను పార్టీ తలకిందులు చేయబోతోందని మరికొంత మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం ద్వారా దక్షిణాదిని దూరం పెడుతున్నారన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని అంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌ పదవికి బీజేడీకి చెందిన భర్తృహరి మహ్‌తాబ్‌ పేరును పరిశీలిస్తున్నారు. 17వ లోక్‌సభ తొలి సమావేశం జూన్‌ 17 నుంచి ప్రారంభం కానుండగా.. జూన్‌ 19న స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. త్వరలో లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరన్నదానికి ఫుల్ స్టాప్ పడనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle