newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

16న ఉన్నావ్ కేసు తీర్పు.. ఏం జరగబోతోంది?

11-12-201911-12-2019 09:57:23 IST
2019-12-11T04:27:23.116Z11-12-2019 2019-12-11T04:27:09.836Z - - 20-04-2021

16న ఉన్నావ్ కేసు తీర్పు.. ఏం జరగబోతోంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది ఉన్నావ్ కేసు. బాధితురాలిపై దాడి అనంతరం చికిత్స పొందుతూ మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్‌’లో మైనర్‌ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగారి అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్‌ ధర్మేశ్‌ శర్మ తెలపడంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

2017లో మైనర్‌ బాలికను బీజేపీ ఎమ్మెల్యే కిడ్నాప్‌ చేసి గ్యాంగ్‌రేప్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీ హైకోర్టుకు మార్చారు. అత్యంత రహస్యంగా విచారణలో ఈ నెల 2న నిందితుడు తన వాదనలు వినిపించగా, సోమవారం సీబీఐ తన వాదనలను కోర్టులో వినిపించింది. 

సెంగార్‌ నిందితుడిగా ఉన్న ఈ కేసులో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును గత జూలై 28న ఓ ట్రక్కు ఢీకొట్టింది. అనంతరం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి ఢిల్లీ మహిళా కమిషన్‌ ఆశ్రయమిచ్చి ఢిల్లీలో ఉంచింది. సుప్రీం ఆదేశాలతో ఆ కుటుంబానికి సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించారు.

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిని సజీవంగా తగుల బెట్టి చంపే ప్రయత్నం చేశారు దుండగులు. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో పోరాడి బాధితురాలు మరణించిన సంగతి తెలిసిందే.  బాధితురాలి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపశమన చర్య కింద రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఈ పరిహారాన్ని బాధితురాలి కుటుంబం తిరస్కరించింది. 

తన కూతురి మృతికి కారణమైన వారిని వెంటనే చంపేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ‘నా కూతురి మృతికి కారణమైన దోషులను హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ తరహాలో చంపేయాలి. లేక వెంటనే ఉరి తీయాలి. అదే నాకు ఓదార్పు. నాకు ఎటువంటి ఆర్థిక సాయం అవసరం లేదు’’ అని ఆయన ప్రభుత్వ సహాయాన్ని తోసిపుచ్చారు. ఈ నెల 16న రాబోయే తీర్పు ఎలా వుంటుందో చూడాలి. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle