13లక్షలకు చేరువలో భారత్ కరోనా కేసులు
24-07-202024-07-2020 10:07:24 IST
Updated On 24-07-2020 10:14:32 ISTUpdated On 24-07-20202020-07-24T04:37:24.567Z24-07-2020 2020-07-24T04:36:51.057Z - 2020-07-24T04:44:32.527Z - 24-07-2020

భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రదశకు చేరుకుంది. గత 24 గంటల్లో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒక్కనాడే 740 మంది మృతి చెందారు. దీంతో 12,88130కు చేరాయి కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 30,645 మంది మృతిచెందారు. అన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్నమొన్నటివరకూ ఒక మోస్తరుగా వున్న కరోనా కేసులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి, రెండు రాష్ట్రాల్లోనూ కేసులు లక్షా 20వేలు దాటిపోయాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలో భారతదేశం మూడోస్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ కొనసాగుతున్నాయి.మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 30వేలు దాటింది. దీంతో అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. ఇక శుక్రవారం ఉదయం నాటికి కేసుల్లో మరో రికార్డు నమోదయ్యింది. వారం రోజుల కిందట 25వేలుగా ఉన్న కరోనా మరణాలు.. మరో ఏడు రోజుల్లో 30వేలు దాటాయి. అంతకు ముందు 20 వేల నుంచి 25 రోజులకు చేరడానికి 10 రోజులు సమయం పట్టింది. కానీ 15 వేల నుంచి 20వేలకు చేరడానికి 11 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం కరోనా మరణాల్లో ఫ్రాన్స్ దేశాన్ని భారత్ అధిగమించింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. భారత్లో కరోనా మృతుల రేటు 3.6 శాతం ఉండగా... మొత్తం కరోనా మరణాలు 40 శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. ముంబయి నగరంలో ఇప్పటి వరకూ 5,930 మంది కరోనాతో చనిపోయారు.దేశంలోనే మహారాష్ట్ర తరువాత ఏపీలోనే ఒక్కరోజులో 7 వేల కేసులు దాటాయి. దీంతో ఆందోళన మరింతగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 3,47502, మరణాలు 12854 తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు 192,964 మరణాలు 3232 ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 2,25,011, మరణాలు3745 కర్నాటకలో కరోనా పాజిటివ్ కేసులు 80,863 మరణాలు 1616 ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 72 వేల 71కి, మరణాలు 884 యూపీలో కరోనా పాజిటివ్ కేసులు 58,104, మరణాలు 1298 గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసులు 52,563 మరణాలు 2256 పశ్చిమబెంగాల్ లో కరోనా కేసులు 51,757, మరణాలు 1255 తెలంగాణ లో పాజిటివ్ కేసులు 50, 826, మరణాలు 447

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
5 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
6 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
12 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
7 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా