newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

10 జన్ పథ్‌లో ఏం జరుగుతోంది?

07-03-202007-03-2020 08:27:44 IST
2020-03-07T02:57:44.050Z07-03-2020 2020-03-07T02:56:51.047Z - - 11-04-2021

10 జన్ పథ్‌లో ఏం జరుగుతోంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధికారమంతమందు చూడవలె.. అంటారు. అధికారంలో లేని పార్టీ అంటే అందరికీ లోకువే. స్వంత పార్టీ నేతలే లైట్ తీసుకుంటారు. జాతీయ పార్టీ అంటే హైకమాండ్ నిర్ణయమై ఫైనల్. అయితే దరిద్రం దరిదాపుల్లోనే ఉన్నప్పుడు జాతీయ పార్టీ అయినా సరే రాష్ట్ర నాయకులకు తలవంచాల్సిందే. అదీ పూర్తిగా అధికారానికి దూరమయిన పార్టీ సంగతయితే చెప్పాల్సిన పనిలేదు.

అధికారంలో ఉన్నంత వరకే హైకమాండ్ చెప్పినట్లు నడుస్తుంది. పవర్ లేకపోతే జాతీయ పార్టీ అయినా సరే ప్రాంతీయ నాయకులకు సలాం అనాల్సిందే. ఈ పరిస్థితి ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ కు ఎదురవుతుందని చెప్పాలి.  కొన్ని నెలలుగా నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచుతూ నాన్చడానికి కారణం రాష్ట్ర స్థాయి నేతలే.

కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి ఆరేళ్లు కావస్తోంది. వరసగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలను వదిలేయడం, సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అంతేకాదు తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సయితం స్వేచ్ఛగా నిర్ణయాలను కాంగ్రెస్ అధిష్టానం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేతల మధ్య విభేదాలు తలెత్తితే అసలుకే ఎసరొస్తుందనే భయం కావచ్చు. కర్ణాటకలో నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. అయితే కాంగ్రెస్ లో విభేదాల కారణంగానే అది అధికారానికి దూరమయింది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ కర్ణాటకలో బలంగానే ఉంది.

ట్రై చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే వీలుంది. అయితే ఇక్కడ కొన్ని నెలలుగా పీసీసీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ నాయకత్వం భర్తీ చేయలేకపోతుంది. ఇందుకు కారణం డీకే శివకుమార్ అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత సిద్ధరామయ్య వ్యతిరేకించడమే. డీకే శివకుమార్ పేరు పీసీసీ చీఫ్ గా ఖరారయినప్పటికీ ప్రకటించే ధైర్యం చేయలేకపోతుంది. అందరికీ నచ్చ చెప్పిన తర్వాతనే ప్రకటించాలన్న ఉద్దేశ్యంతో ఉంది.

ఇక మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా పీసీసీ అధ్యక్షుడి పేరును కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి కమల్ నాధ్, యువనేత జ్యోతిరాదిత్య సింధియాల మధ్య కొన్నాళ్లుగా వార్ నడుస్తోంది. అసలే కొనఊపిరితో ఉన్న సర్కార్ తేడా వస్తే కూలిపోతుంది. జ్యోతిరాదిత్య సింధియా పీసీసీ చీఫ్ గా నియమించితే ఒప్పుకునేది లేదని కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ లు వార్నింగ్ లు పంపుతున్నారు.

సింధియా సయితం కాంగ్రెస్ కు పరోక్షంగా ఝలక్ లు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పీసీసీ చీఫ్ పదవిని భర్తీ చేయలేదు. దీంతో పాటు రాజస్థాన్ పీసీపీ చీఫ్ పదవికి కూడా నియామకం జరగాల్సి ఉంది.

ఇలా ప్రతి రాష్ట్రంలో నేతలను సంతృప్తి పర్చలేక, గ్రూపు విభేదాలను పరిష్కరించలేక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. అందుకే అంటారు అధికారంలో ఉంటేనే ఎవరైనా మాట వింటారు.. లేకుంటే… ఆ వైపు కూడా చూడరన్న సామెత టెన్ జన్ పథ్ కు ఖచ్చితంగా సరిపోతుంది. ఆ మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ హైకమాండ్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle