newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు

28-12-201928-12-2019 08:59:48 IST
Updated On 28-12-2019 10:34:16 ISTUpdated On 28-12-20192019-12-28T03:29:48.737Z28-12-2019 2019-12-28T03:29:14.324Z - 2019-12-28T05:04:16.516Z - 28-12-2019

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జార్ఖండ్ ఎన్నికలలో విజయం సాధించిన హేమంత్ సోరెన్ నూతన సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్‌లో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు హేమంత్‌ సొరేన్‌ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌పవార్‌తోపాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే , రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ , ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భఘేల్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులను ఆహ్వానించామని జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య చెప్పారు.

మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. విపక్ష నేతలంతా పెద్ద ఎత్తున హాజరు కానున్న నేపధ్యంలో అందరి దృష్టి జార్ఖండ్ వైపు మళ్లింది. బీజేపీని మట్టికరిపించిన హేమంత్ సోరెన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పిపోయాయి. 

అయితే, ప్రధాని మోదీ తన బిజీ షెడ్యూల్‌ కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం లేదు. కానీ, హేమంత్‌ సొరేన్‌కు మోడీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, సీపీఐ నేత కన్హయ్య కుమార్‌ తదితరులను ఆహ్వానించారు.

ప్రతిష్టాత్మకంగా జరిగిన జార్ఖండ్‌ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 25 స్థానాలకే పరిమితం అయింది. జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జేఎంఎం అవసరమైన స్పష్టమైన మెజార్టీ సాధించింది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలకు గాను ఈ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించింది.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle