newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హిందూత్వపై మారని ఉద్దవ్ వైఖరి.. వేచి చూస్తున్న ఫడ్నవీస్

02-12-201902-12-2019 10:02:37 IST
2019-12-02T04:32:37.615Z02-12-2019 2019-12-02T04:31:08.907Z - - 17-04-2021

హిందూత్వపై మారని ఉద్దవ్ వైఖరి.. వేచి చూస్తున్న ఫడ్నవీస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయం వైకుంఠపాళి. ఎవరు ఎప్పుడు మెట్లెక్కుతారో.. ఎవరు పామునోట్లో పడి కిందకు జారిపోతారో తెలీదు. దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలో అదే జరిగింది. వారం క్రితంవరకూ ఆయనే సీఎంగా ఉన్నారు. అర్థరాత్రి పరిణామాలతో సీఎం అయ్యారు. బలపరీక్ష నేపథ్యంలో ముందే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రస్తుతం విపక్షనేతగా ఉన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణం, చేయడం వెంటవెంటనే సభా విశ్వాసం పొందడం చకచకా జరిగిపోయాయి.

మొన్నటి వరకూ సీఎంగా ఉన్న ఫడ్నవీస్ పాత్ర మారిపోయింది. అసలు అసెంబ్లీలోనే అడుగుపెట్టని ఉద్దవ్ థాక్రే సభా నాయకుడి అవతారం ఎత్తారు.

తొలిసారి అసెంబ్లీలో ఉద్దవ్ తన ప్రసంగం చేశారు. హిందూత్వ ఎజెండాను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం ఉద్ధవ్‌ థాక్రే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరుని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడారు.

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమంలో లౌకికవాదాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రెండు, మూడు రోజుల్లోనే ఠాక్రే అసెంబ్లీ సాక్షిగా హిందూత్వపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ‘హిందూత్వని నిన్న అనుసరించాను. ఇవాళ అనుసరిస్తున్నాను. రేపు కూడా అనుసరిస్తాను’అని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది. 

ఎన్నికల ముందు వరకూ కలిసి తిరిగిన నేతలు ఇప్పుడు రాజకీయంగా శత్రువులుగా మారారు. ఐదేళ్ళపాటు సీఎం గా పనిచేసిన ఫడ్నవీస్ స్థానం మారింది.  ఫడ్నవీస్‌ మళ్లీ నేనే వస్తా అన్న నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారని ఉద్దవ్ అన్నారు. ‘నేను ఎప్పుడూ మళ్లీ వస్తానని చెప్పలేదు.

కానీ ఈ సభకు వచ్చాను. మహారాష్ట్ర ప్రజలకి, ఈ సభకి నేను ఒక హామీ ఇస్తున్నాను. రాత్రికి రాత్రి ఏమీ చెయ్యను’ అంటూ ఫడ్నవీస్‌పై సెటైర్లు వేశారు. ఆద్యంతం ఫడ్నవీస్ గురించే మాట్లాడారు ఉద్దవ్. కాసేపట్టోనే ఉద్దవ్ తన మిత్రుడి గురించి సానుకూల వైఖరి కనబరిచారు. ఫడ్నవీస్‌ 25 ఏళ్లుగా తనకు మంచి మిత్రుడని, ఎప్పటికీ స్నేహితుడిగానే ఉంటామని చెప్పారు.

మరోవైపు స్పీకర్ ఎన్నిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి,. బీజేపీ స్పీకర్‌ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

బీజేపీ తమ పార్టీ అభ్యర్థి కిసాన్‌ కఠోర్‌ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో పటోలె స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రైతుల సమస్యలు బాగా తెలిసిన వ్యక్తి స్పీకర్‌ పదవిని అందుకోవడం హర్షణీయమని ఠాక్రే వ్యాఖ్యానించారు. స్పీకర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగించడానికే రేసు నుంచి తప్పుకున్నట్టు బీజేపీ ప్రకటించింది.

శివసేన ముందునుంచీ హిందూత్వకే కట్టుబడి ఉంది. ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి వీరి ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి. ముందునుంచీ బీజేపీ విమర్శలు చేస్తూనే వుంది. ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఎంత వరకూ స్థిరంగా ఉంటుందో నాకు అనుమానమే, కానీ మేం మాత్రం ఓ బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటూ దేవేంద్ర ఫడ్నవీస  వ్యాఖ్యానించారు.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle