newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హిందీ రాదా.. మీరు భారతీయులేనా... కనిమొళికి విమానాశ్రయంలో షాక్

10-08-202010-08-2020 08:58:24 IST
Updated On 11-08-2020 12:38:45 ISTUpdated On 11-08-20202020-08-10T03:28:24.457Z10-08-2020 2020-08-10T03:28:21.159Z - 2020-08-11T07:08:45.273Z - 11-08-2020

హిందీ రాదా.. మీరు భారతీయులేనా... కనిమొళికి విమానాశ్రయంలో షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏమిటీ.. మీకు హిందీ రాదా.. మీరు అసలు భారతీయులేనా.. ఈ ప్రశ్న సామాన్య వ్యక్తికి ఎదురై ఉంటే అది ఇంత సంచలనం కలిగించి ఉండదు. కానీ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నది సాక్షాత్తూ డీఎంకే పార్టీకి చెందిన మహిళా ఎంపీ, కరుణానిధి కుమార్తె కనిమెళి కావడంతో ఇప్పుడిది వైరల్ అయింది.

విషయానికి వస్తే... ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన కేరళలోని కోళీకోడ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన డీఎంకే నేత, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి దయానిధికి చేదు అనుభవం ఎదురైంది. ఘటనాస్థలంలో విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా’అని ప్రశ్నించి కనిమొళిని అవమానించారు. 

ఈ విషయాన్ని కనిమొళి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ విమానం ప్రమాదం జరిగిన కోళీవుడ్‌ ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఉదయం వెళ్లాను. అయితే, అక్కడున్న ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా జవాను హిందీలో నాతో ఏదో చెబుతోంది. నాకు హిందీ రాదని, దయచేసి తమిళం లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడమని సూచించాను. 

దానికి ఆ జవాను స్పందన చూసి మతి పోయింది. హిందీ తెలియదా ఇంతకూ మీరు భారతీయులేనా అని ఆమె నన్ను ప్రశ్నించింది. అంటే హిందీ భాష వచ్చినవారు భారతీయులు అన్నట్టేనా!’ అని ఎంపీ కనిమొళి ట్విటర్‌లో పేర్కొన్నారు. 

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు ఏదో ఒకవిధంగా బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై #hindiimpostion అనే హ్యాష్‌ టాగ్‌ను కూడా ఆమె పోస్టు చేశారు.

నేను ఒక విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. హిందీ తెలిసి ఉంటేనే ఇండియనా? హిందీకి సమానార్థం ఇండియనా?' అని కనిమొళి ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు. 

నా భారతీయత గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కానీ భారతీయ జనతాపార్టీ హిందీని కూడా ఒక రాజకీయ అంశంగా మార్చేసింది. ఇతరుల్లాగే నేనూ భారతీయురాలిని. ఈ విషయంలో నేను ఎవరి ముందూ నిరూపించుకోవలసిన అవసరం నాకు లేదు. కేంద్రం పనిగట్టుకుని హిందీని రుద్దడానికి ఎజెండాతో వస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన నూతన విద్యాపథకం కూడా దీంట్లో భాగమే అని కనిమొళి విమర్శించింది.

ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్, కార్తి చిదంబరం డిఎంకే ఎంపీకి మద్దతు తెలిపారు. పరమ హాస్యాస్పదం, తీవ్రంగా ఖండిచదగిన విషయం అంటూ వారు మీడియాముందు వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల్లో భాషా పరీక్షా? తర్వాతేంటి.. సీఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ దీని పట్ల స్పందించాలి అని కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారం వైరల్ కావడంతో సీఐఎస్ఎఫ్ దీనిపై విచారణకు ఆదేశించింది. పైగా కనిమొళికి జరిగినదానిపట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ అనుభవం ఆమెకు ఏ విమానాశ్రయంలో ఎదురైంది. ఏ తేదీన, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఇది జరిగిందో కనిమొళి తమకు వివరాలు పంపితే ఈ సంఘటనపై విచారణకు పూనుకుంటామని సీఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయం పేర్కొంది.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   12 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle