newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

హస్తినలో బాబు బిజీబిజీ ...మే 23 యాక్షన్ ప్లాన్?

18-05-201918-05-2019 13:16:45 IST
Updated On 27-06-2019 16:03:10 ISTUpdated On 27-06-20192019-05-18T07:46:45.763Z18-05-2019 2019-05-18T07:46:40.800Z - 2019-06-27T10:33:10.195Z - 27-06-2019

హస్తినలో బాబు బిజీబిజీ ...మే 23 యాక్షన్ ప్లాన్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఉత్కంఠ రేపిన సార్వత్రిక ఎన్నికలు ఆదివారంతో ముగియనున్నాయి. 23న ఫలితాలు రానున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందే హస్తినలో వేడి రాజుకుంది. ఫలితాల తర్వాత ఏం చేయాలనేదానిపై బీజీపీయేతర పక్షాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు.

ఎన్డీయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ, పొత్తులు,రీపోలింగ్ విషయంలో ఇద్దరూ చర్చించారు.

అంతకుముందు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇవాళ ఉదయం ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాతో సమావేశమై మే 23 ఎన్నికల ఫలితాల అనంతరం ఏం చేయాలనేదానిపై చర్చించారని తెలుస్తోంది.

ఆ తర్వాత ఏపీ భవన్‌ నుంచి రాహుల్‌ నివాసానికి బయలు దేరి వెళ్లారు చంద్రబాబు. వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈనెల 19న తుదివిడత పోలింగ్‌ ముగియనుండటంతో ఎన్డీఏకు ఎన్నిసీట్లు వచ్చే అవకాశముంది, యూపీఏకు ఎన్ని సీట్లు వస్తాయి, మే 23 తర్వాత అనుసరించాల్సిన కార్యచరణ.. తదితర అంశాలపై వీరిద్దరూ సమాలోచనలు చేశారు.

రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత శరద్‌పవార్‌ ని కలిశారు. మహాగట్బంధన్ గురించి చర్చించారు. అనంతరం శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం లక్నో వెళ్లనున్నారు చంద్రబాబు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు... యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో ఆయనతో భేటీ కానున్నారు. యూపీ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీ పరిస్థితిపై చర్చిస్తారు. ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. 

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle