newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హర్యానాలో ’హస్త’ వాసి అంతంత మాత్రమే!

12-10-201912-10-2019 15:56:32 IST
2019-10-12T10:26:32.111Z12-10-2019 2019-10-12T10:26:20.210Z - - 14-04-2021

హర్యానాలో ’హస్త’ వాసి అంతంత మాత్రమే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హర్యానా అసంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో కాంగ్రెస్ ఒకింత వెనుకబడిందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా అసెంబ్లీకి ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి.  హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్నీ వదలకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు తగ్గట్టుగానే పార్టీ యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగించి...ప్రచార దూకుడును పెంచింది. పార్టీ హర్యానా అధ్యక్షురాలు కుమారి శెల్జా ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని పార్టీ విజయం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.

సరిగ్గా ఇక్కడే హర్యానాలో కాంగ్రెస్ కు అనూహ్యమైన ప్రతిఘటన ఎదురౌతున్నది. తమకు ప్రాధాన్యతా, ప్రాముఖ్యతా తగ్గిందంటూ కాంగ్రెస్ సీనియర్ లు అలక బూనారు. కొందరు పార్టీకి దూరమౌతున్నారు. మరి కొందరు కాంగ్రెస్ లో ఉంటూనే పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ కుమారి శెల్జా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికలలో విజయం దిశగా నడిపించేందుకు కృషి చేస్తున్నారు.

అందులో భాగంగానే  ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు చెందిన ఇద్దరు బలమైన నేతలను కాంగ్రెస్ గూటికి చేర్చారు. వారిరువురూకూడా మాజీ ఎంపీలు కావడం గమనార్హం. చరణ్ సింగ్ నోరి, సుశీల్ కుమార్ ఇండోరాలిరువురూ ఇటీవలే పార్టీ రాష్ట్ర అద్యక్షురాలు కుమారి శెల్జా సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

21న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుంటే...సీనియర్ల తీరు కారణంగా ఆ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. ఇక పార్టీ అధిష్టానం కూడా సీనియర్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని కూడా పార్టీ ఎన్నికల వ్యూహాలలో భాగస్వామ్యం చేసే విషయంలో ఎటువంటి సానుకూలతా చూపడం లేదు. సీనియర్ల ఎక్స్ పీరియన్స్ ఎన్నికల వ్యూహాల రూపకల్పనలోనూ, కార్యాచరణ ప్రణాళిక అమలులోనూ ఎంతో ఉపయోగపడుతుందని తెలిసినా కూడా వారిని విస్మరించడానికి హై కమాండ్ మొగ్గు చూపుతున్నదని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

అసలు పార్టీ పగ్గాలు ఎన్నికల ముందు కుమారి శెల్జాకు అప్పగించడానికి ప్రధాన కారణం పార్టీ సీనియర్ నేత, హర్యానా పీసీసీ చీఫ్ అశోక్ తన్వర్ పార్టీకి రాజీనామా చేయడమే. ఆయన రాజీనామా పార్టీని షాక్ కు గురి చేసిందనడంలో సందేహం లేదు. దీంతో యువనేతగా గుర్తింపు పొందిన శెల్జాకు పార్టీ రాష్ట్ర సారధ్య బాధ్యతలను హైకమాండ్ అప్పగించింది. కానీ ఎన్నికలకు ముందు అశోక్ తన్వర్ రాజీనామా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై విపక్షాలకే కాదు, స్వపక్షీయులకు కూడా సంకేతాలను పంపింది.

అశోక్ తన్వర్ రాజీనామా హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ ఓటమి ఖాయమనే విషయాన్ని నిర్ధారించిందని బీజేపీ చెబుతోంది. ఇక మరో సీనియర్ నేత సంపత్ సింగ్ కూడా పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెబుతున్నారు. అలాగే సంపత్ సింగ్ తో పాటు అశోక్ తన్వర్ కూడా కమలం కండువా కప్పుకుంటారని బీజేపీ శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. ఇఫ్పటికే సంపత్ సింగ్ హర్యానా ముఖ్యమంత్రిని కలిశారు.

హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ..విపక్ష బలహీనత కారణంగా అది ఎన్నికలపై ప్రభావం చూపేంతగా జనంలో గూడుకట్టుకోలేదని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. అంతో కొంత ప్రజా వ్యతిరేకతను సైతం ఇటీవల ప్రధాని మోడీ తీసుకున్నకొన్ని నిర్ణయాల కారణంగా సోదిలోకి లేకుండా పోయిందనీ, స్థానిక సమస్యల కంటే జాతీయ అంశాలే ఎన్నికలలో ప్రధాన అంశాలుగా మారిపోయాయనీ, దేశ భద్రత, కాశ్మీర్ లే బీజేపీ విజయానికి సోపానాలుగా మారనున్నాయనీ బీజేపీ విశ్వాసంతో ఉంది.

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle