newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హర్యానాలో హంగ్...అదే జరుగుతుందా?

24-10-201924-10-2019 13:38:51 IST
Updated On 24-10-2019 17:04:53 ISTUpdated On 24-10-20192019-10-24T08:08:51.324Z24-10-2019 2019-10-24T08:08:48.709Z - 2019-10-24T11:34:53.334Z - 24-10-2019

హర్యానాలో హంగ్...అదే జరుగుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హర్యానా రాజకీయం రంజుగా మారింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే...రాష్ట్రంలో హంగ్ తథ్యమని అర్ధమౌతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో  కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ రచనలో మునిగిపోయాయి. ఒక పక్క ఫలితాలు వెలువడుతుండగానే...కాంగ్రెస్, బీజేపీలు తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. బయటి నుంచి మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ఈ ప్రయత్నాలలో ఇరు పార్టీల దృష్టీ జాట్ ల మీదే ఉంది. ఫలితాలలో జేజేపీ 10 నుంచి 11 సీట్ల వరకూ సాధించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో బీజేపీ, కాంగ్రెస్ లు ఆ పార్టీ మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించేశాయి. 

బీజేపీని ఎలాగైనా రాష్ట్రంలో అధికారం నుంచి దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ కర్నాటక మార్క్ రాజకీయానికి తెరలేపింది. ముఖ్యమంత్రి పదవి జేజేపీకి ఇస్తామన్న ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. సహజంగానే ఇందుకు జేజేపీ అంగకరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే బీజేపీ కూడా అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ కూడా ఇదే ప్రతిపాదనను జేజేపీ ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక వైపు ఫలితాలు వెలువడుతుండగానే రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కర్తార్ ను హస్తినకు రావలసిందిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. దీంతో ఆయనన హుటాహుటిన హస్తినకు బయలు దేరారు. దీంతో పరిశీలకులు కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంపై బీజేపీ కూడా చురుకుగా వ్యవహరిస్తున్నదని విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా రాష్ట్రంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న విషయం జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా చేప్పారు. దనిని బట్టే హర్యానాలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలూ సమాయత్తం అవుతున్నాయని తేటతెల్లమౌతున్నది.

హర్యానాలో జాట్ ల ప్రాబల్యం విస్మరించలేం. రాష్టంలో జాట్ ల శాతం 22..కాగా ప్రభుత్వోద్యోగాలలో, పోలీసు శాఖలో జాట్ ల శాతం ఎక్కువే. హర్యానాలో అత్యంత అనాగరికంగా జాట్ పంచాయతీలు జరుగుతున్నా...ఆ పంచాయతీ పెద్దలపై చర్యలు తీసుకున్న సందర్భాలు అతి తక్కువ. జాట్ రిజర్వేషన్ల కోసం ఉద్యమం పలు మార్లు హింసాత్మకంగా మారింది. సుప్రీం పరిమితి కారణంగానే ఆ రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకూ అసెంబ్లీ ఆమోదం పొంద లేదు కానీ లేకుంటే రాష్ట్రంలో జాట్ ల ప్రాబల్యం, ఆధిపత్యం మరింత పెరిగేది. జాతీయ పార్టీలు కూడా తమ విజయం కోసం జాట్ లపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. హర్యానాలో జాట్ల మద్దతు కోసం కాంగ్రెస్ పాకులాడుతూ వచ్చింది. 

బీజేపీ అందుకు భిన్నంగా వ్యూహ రచన చేసి జాట్ ఏతర వర్గాలను ఏకం చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చింది. దీంతో జాట్ లు జేజేపీ (జననాయ్ జనతా పార్టీ) పేర సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆ పార్టీయే ఇప్పుడు తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. హంగ్ ఏర్పడే అవకాశాలు ఉండటంతో  పది నుంచి పదకొండు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్న జేజేపీ చుట్టూ ఇప్పుడు హర్యానా రాజకీయం మోహరించింది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లు తమకు అధికారం దక్కకపోయినా ప్రత్యర్థి పార్టీకి దక్కవద్దు అన్న వ్యూహంతో పావులు కదుపుతుండటంతో ఇక్కడ రాజకీయం వేడెక్కింది. ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే...తెరవెనుక మంతనాలు ప్రారంభమయ్యాయి. ఇరు పార్టీలూ కూడా ఇప్పుడు జేజేపీ మద్దతు, అండ, సహకారం కోసం అర్రులు చాచే పరిస్థితి ఉంది.

సరిగ్గా కర్నాటకలో ఏం జరిగిందో...హర్యానాలోనూ కూడా అదే జరిగే అవకాశం కనిపిస్తున్నది. జేజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి...ఆ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములుగా అధికారంలోకి రావలన్న భావన బీజేపీ, కాంగ్రెస్ లలో వ్యక్తమౌతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రకటన కూడా చేసింది. బీజేపీ నుంచి అధికారికంగా అటువంటి ప్రకటన ఏదీ రానప్పటికీ...ఆ పార్టీ అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రికి హస్తినకు రావలసిందిగా అమిత్ షా ఆదేశించడాన్ని బట్టి అర్ధమౌతున్నది.  

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle