హర్యానాలో మరాఠాల ఓట్లే కీలకమా?
14-05-201914-05-2019 07:30:33 IST
Updated On 28-06-2019 12:43:42 ISTUpdated On 28-06-20192019-05-14T02:00:33.145Z14-05-2019 2019-05-14T02:00:09.846Z - 2019-06-28T07:13:42.008Z - 28-06-2019

హర్యానాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మరాఠాల ఓట్లే కీలకంగా మారనున్నాయి. కర్ణాల్, రోహతక్, భివాని ఎంపీ సీట్లలో దాదాపు 7 లక్షలకు పైగా ఉన్న పీష్వా బ్రాహ్మణ మరాఠాల ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయట. చరిత్ర పరంగా చూస్తే 1761లో జరిగిన మూడవ పానిపట్ యుద్దం తర్వాత చాలా మంది పీష్వా బ్రాహ్మణ మరాఠా యోధులను ఆఫ్ఘన్ సైన్యం బందీలుగా పట్టుకెళ్లింది. అయితే వారి నుంచి తప్పించుకున్న 500 మంది రోహతక్ అడవుల్లో తలదాచుకున్నారు. అప్పటి సంతతే ఇప్పుడు 7 లక్షలకు చేరుకుంది. ఇక ఈ ఎన్నికల్లో కర్ణాల్, రోహతక్, భివాని సీట్ల మీద కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కన్నేశాయి. అందుకే చాలా జాగ్రత్తగా అభ్యర్ధులు ఎంపిక చేశాయట. సహజంగా మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలిచే ఈ వర్గం, 2009, 2014 ఎన్నికల్లో బీఎస్పీకి ఓటేసింది. ఎందుకంటే మరాఠా వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వడమే ఇందుకు కారణం. ఇక రెండేళ్ల క్రితం మరాఠా జాగృతి మంచ్ అధ్యక్షుడు వీరేంద్ర సింగ్ వర్మ, సొంతంగా పార్టీ పెట్టారు. గతేడాది ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. అందుకే ఈ ఎన్నికల్లో తమ వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని వర్మ చెబుతున్నారు. అయితే కర్ణాల్, భివాని సీట్లలో బలంగా ఉన్న సంఘ్ పరివార్, మరాఠాల్లోని పెద్దలతో మాట్లాడిందట. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ తీవ్రంగా ప్రచారం చేసిందట. అందుకే కనీసం 65 శాతం మరాఠాల ఓట్లు తమ ఖాతాలోకి వచ్చేలా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే, వీరి ఓటు బ్యాంకుతో దాదాపుగా సమానంగా ఉన్న ఖత్రి పంజాబీల ఓట్లు తమకే అండగా ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. కర్ణాల్, భివాని సీట్లలో పంజాబీ ఖత్రి వర్గానికి చెందిన వారికే టిక్కెట్లు ఇచ్చింది బీజేపీ. అందుకే మరాఠాల ఓట్లు కూడా తమకు వస్తే ఈ రెండు సీట్లలో గెలవడం ఖాయమనేది బీజేపీ పెద్దల అంచనా.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా