newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హర్యానాలో బీజేపీ స్పీడ్ కు బ్రేకేదీ..!

23-09-201923-09-2019 12:41:37 IST
2019-09-23T07:11:37.691Z23-09-2019 2019-09-23T07:11:32.792Z - - 17-04-2021

హర్యానాలో బీజేపీ స్పీడ్ కు బ్రేకేదీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కూడా ఆ రాష్ట్రంలో ఎన్నికల హంగామా, హడావుడి పెద్దగా కనిపించడం లేదు. విపక్షాలు  ఎన్నికల సమరానికి సన్నద్ధంగా లేని పరిస్థితి ఒక వైపు ఉండగా. సర్వం సన్నద్ధంగా బీజేపీ మరో వైపు ఉంది. ముఖ్యమంత్రిగా మనోహర్ ఖట్టార్ ఎన్నికల విజయంపై సంపూర్ణ విశ్వాసంతో ఉండగా మరో వైపు కాంగ్రెస్ గత సార్వత్రిక ఎన్నికలలో పరాభవం నుంచి ఇప్పటికీ తేరుకోని పరిస్థితిలో ఉంది.

గత  పార్లమెంటు ఎన్నికలలో రాష్ట్రంలోని పది లోక్ సభ స్థానాలకు గాను పదింటిలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ దాదాపుగా అటువంటి విజయమే రానున్న అసెంబ్లీ ఎన్నికలలోనూ ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నది. 2014 ఎన్నికలలో కూడా హర్యానాలో బీజేపీదే హవా. అప్పట్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి జరిగాయి. అప్పట్లో బీజేపీ 47 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికలలో మాత్రం బీజేపీ  తిరుగులేని విజయాన్ని సాధించింది. మొత్తం పది స్థానాలనూ తన ఖాతాలో వేసుకుని ప్రత్యర్థి పార్టీలు ఖాతా తెరిచే పరిస్థితే లేకుండా చేసింది.

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్ డి)లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2014 నుంచీ కూడా రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. సాధారణంగా అధికార పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిబంధకంగా మారుతుంది. కానీ హర్యానాలో అధికార పార్టీకి ఆ బెడద కనిపించడం లేదు సరికదా...కాంగ్రెస్, ఐఎన్ఎల్ డి ల నుంచి వలసల రూపంలో నేతలు వచ్చి చేరి బలం పెంచేశారు.

ముఖ్యంగా కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రంలోని మోడీ సర్కార్ రద్దు చేసిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు కమలం గూటికి చేరడానికి క్యూకట్టారు. ఇదే కేంద్రం నిర్ణయానికి రాష్ట్ర ప్రజల నుంచి సానుకూల స్పందన ఉన్నదనడానికి సంకేతం.   రాష్ట్రంలో అత్యధికులుగా ఉన్న ఖట్టర్ లలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉన్నది.

ఆ అసంతృప్తిపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుందని చెప్పవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ వైపు ఖట్టర్ లు మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపించడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షడిగా హూడా నియామకం ఖట్టర్ వర్గీయులలో అసంతృప్తికి, అసమ్మతికి కారణమైంది. ఇక ఐఎల్ఎల్డీ విషయానికి వస్తే ఆ పార్టీ నాయకత్వం కానీ, కేడర్ కానీ చురుకుగా ఉన్న దాఖలాలు కనిపించవు. అధికారంలోనికి వస్తామన్న విశ్వాసం కానీ, రావడానికి ప్రయత్నించాలన్న ఉత్సాహం కానీ ఆ పార్టీలో పెద్దగా కనిపించడం లేదు.

ఇటీవల పలువురు నేతలు పార్టీని వీడి కమలం పంచన చేరడమే అందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల పట్ల బీజేపీలో ఉన్న ధీమా ఇతర పార్టీలలో కనిపించడం లేదు. ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలూ ఉన్నా రాష్ట్ర ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. కేవలం ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు పార్టీ ఫిరాయింపులు ఆందోళనను కలిగిస్తున్నాయి.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత కూడా పార్టీలలో జోరు కానీ, హుషారు కానీ కనిపించకపోవడానికి ఇదే కారణంగా చెప్పవచ్చు. ఇక ‘మహా’ఎన్నికల సంగ్రామంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా దృష్టి పెట్టడంతో రాష్ట్ర కాంగ్రెస్ ను ఎన్నికల విజయం దిశగా నడిపించే విధంగా అధిష్టానం మార్గదర్శనం కరవైంది. దీంతో కాంగ్రరెస్ లో గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలలోపార్టీ వెనుకడబుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   13 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   19 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle