newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హర్యానాలో బీజేపీ మిషన్ 75 ప్లస్‌కు తూట్లు!

22-09-201922-09-2019 11:03:25 IST
2019-09-22T05:33:25.559Z22-09-2019 2019-09-22T05:33:20.314Z - - 11-04-2021

హర్యానాలో బీజేపీ మిషన్ 75 ప్లస్‌కు తూట్లు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హర్యానాలో అయిదేళ్ల క్రితం అనూహ్యంగా పుంజుకుని తన ఓటు షేరును గణనీయంగా పెంచుకున్న పాలక బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లకు పైగా సాధించాలనే తన లక్ష్యాన్ని అందుకోవడంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. అక్టోబర్ 21న రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న సందర్భంగా రానున్న కొద్ది రోజుల్లో 90 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీని కైవసం చేసుకునే పనిలో అపసోపాలు పడుతున్నాయి. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే జరగనుండగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలిచాయి. ఐఎల్ఎల్‌డి, బీఎస్పీ, ఆప్, స్వరాజ్ ఇండియా పార్టీల్లో నిలువునా చీలికలు ఏర్పడటంతో జననాయక్ జనతా పార్టీ అనే కొత్త పార్టీ ఉనికిలోకి వచ్చింది.

నిరుద్యోగం, యువత, రైతులు, ఉద్యోగులు, నీటి సమస్య వంటి అంశాలు, గత అయిదేళ్ల పాలనలో బీజేపీ చేసిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో వైఫల్యాన్ని కూడా ప్రతిపక్షాలు తమ ప్రచారంలో లేవనెత్తనున్నాయి. ఇక అధికార బీజేపీ విషయానికి వస్తే పారదర్శక పాలన, అవినీతిని సహించలేకపోవడం, ప్రతిభ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడం, పౌరుల జాతీయ రిజిస్టర్ అమలుతోపాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సాధించిన విజయాలను కూడా ఆ పార్టీ ప్రచారాంశాలుగా చేసుకోనుంది. కేంద్రం ఇటీవల ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో తన తురుపుముక్కగా ఉపయోగించనుంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతాలు సృష్టించి రాష్ట్రంలోని మొత్తం 10 లోక్‌సభా స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ సమధికోత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటోంది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చీలికల దెబ్బకు కుదేలై ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 75 స్థానాలకు కైవసం చేసుకోవాలనుకుంటున్న ఆ పార్టీ ప్రయత్నానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దివంగత నేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఐఎన్ఎల్‌డి చౌతాలా కుటుంబంలో ముఠా తగాదాలతో గత సంవత్సర కాలంగా వరుసగా ఎదురు దెబ్బలు తింటూ వస్తోంది. అభయ్ సింగ్ చౌతాలా వంటి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే పార్టీలో మిగిలారు.

ఫ్యాక్షనిజం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బతీసింది. అధిష్టానం ఇటీవలే రాష్ట్ర పార్టీలో మార్పులు చేసింది. దీంతో గతాన్ని మర్చి బీజేపీని ఓడించడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా సాగాల్సిందని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. పార్టీలో ముఠా తత్వాన్ని పారదోలేందుకు పార్టీ తన రాష్ట్ర యూనిట్‌కి కుమార్ సెల్జాని చీఫ్‌గాను, మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడాని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గానూ ప్రకటించింది. కిరణ్ చౌదరిని ఎన్నికల మేనిఫెస్టో అధినేతగా నిర్ణయించింది.ఇక ఆప్, జెజెపి, బీఎస్పీ ఈసారి స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగాయి. బీఎస్పీతో జేజేపీ పొత్తు గతనెలలో విచ్ఛిన్నమైంది.

అధికార బీజేపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈదఫా ఎన్నికల్లో తమ పార్టీ 75 స్థానాలను అవలీలగా గెల్చుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. తమ పార్టీకి పోటీగా బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో ఒక్కో అసెంబ్లీలో ఒక్కో ప్రతిపక్ష పార్టీతో పోటీపడుతున్నామని, వారి అనైక్యతే తమ గెలుపు గుర్రమని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి నామినేషన్లు ప్రారంభం కాకముందే తమ అభ్యర్థులందరినీ ఖరారు చేస్తామని ప్రకటించారు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని అద్భుత విజయం సాధించడంతోపాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 10 పార్లమెంట్ స్థానాలనూ కైవసం చేసుకున్న బీజేపీ అమితోత్సాహంతో సాగుతున్నప్పటికీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాలను కొల్లగొట్టాలని అది వేసుకున్న ప్లాన్‌ విజవవంతం అవుతుందా అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2009లో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీ 2014 ఎన్నికల్లో 47 అసెంబ్లీ సీట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది. 

అయితే ఇటీవలి కాలంలో అనేకమంది ప్రతిపక్షాలకు చెందిన నేతలు బీజేపీలో చేరడంతో సీట్ల సర్దుబాటులో లుకలుకలు కారణంగా సొంత పార్టీలోనే కుమ్ములాటలు, పరస్పరం ఓడించుకునే ప్రయత్నాలు మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుపునకు అడ్డంకులుగా మారనున్నాయి. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle