newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

హమ్మయ్య యెడ్డీ టీం ఖరారైనట్టే!

20-08-201920-08-2019 08:05:06 IST
Updated On 20-08-2019 11:13:16 ISTUpdated On 20-08-20192019-08-20T02:35:06.681Z20-08-2019 2019-08-20T02:34:47.269Z - 2019-08-20T05:43:16.265Z - 20-08-2019

హమ్మయ్య యెడ్డీ టీం ఖరారైనట్టే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటకలో రాజకీయాలు శరవేగంగా మారిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా కర్నాటక పీఠం అధిరోహించారు బీజేపీ నేత యడియూరప్ప. సర్కార్ ఏర్పడినా కర్ణాటక కేబినెట్ విస్తరణ జరగలేదు. ఇవాళ మంత్రివర్గం కూర్పు జరుగుతుందని బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ కూటమి మూడు వారాల క్రితం కుప్పకూలింది. అనంతరం యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

మంత్రిపదవులు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. మంత్రివర్గం విస్తరించాలని భావించినా, కొన్ని వర్గాలనుంచి వత్తిడుల కారణంగా యడియూరప్ప కేబినెట్ జోలికి వెళ్ళలేదు. అన్ని శాఖల్ని ఆయన తన వద్దే ఉంచుకుని పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో ఆయన అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి విస్తరణకు రెడీ అయ్యారు. మంగళవారం జరిగే విస్తరణలో 17 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. 

ఇవాళ ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర గంటల మధ్య క్యాబినెట్ విస్తరణ ఉంటుందని యడియూరప్ప చెప్పారు. ఈ విషయం ఇప్పటికే గవర్నర్ కు చెప్పామని, క్యాబినెట్ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను కూడా ఆదేశించామని ఆయన అన్నారు. మంత్రివర్గ కూర్పు యడియూరప్పకు కత్తిమీద సాములాంటిదే.  అసమ్మతి ఎమ్మెల్యేలు, కుల, మత, ప్రాంతీయ సమీకరణాల్ని పరగణనలోకి తీసుకుంటూనే తనకు సహకరించిన అన్ని వర్గాలకు తగిన స్థానం కల్పించాలని భావిస్తున్నారు.

అసమ్మతి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు త్వరలో రానుంది. ఈ నేపథ్యంలో యడియూరప్ప మిగతా ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇస్తారు. మూడువిడతల్లో విస్తరణ ఉండనుంది. తొలివిడత తన అనుయాయులను సంతృప్తి పరచనున్నారు కర్నాటక సీఎం. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle