newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

హమ్మయ్య ముందస్తు బెయిలొచ్చింది

20-05-201920-05-2019 14:53:43 IST
Updated On 27-06-2019 14:17:55 ISTUpdated On 27-06-20192019-05-20T09:23:43.223Z20-05-2019 2019-05-20T09:23:23.568Z - 2019-06-27T08:47:55.860Z - 27-06-2019

హమ్మయ్య ముందస్తు బెయిలొచ్చింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు ఊరట లభించింది. నాథూరాం గాడ్సే తొలి హిందూ తీవ్రవాది అన్న వ్యాఖ్యల వివాదంలో ఆయన చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈవ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈనేపథ్యంలో ఆయనకు మద్రాసు హైకోర్టులోని మదురై బెంచ్‌ ముందస్తు బెయిల్‌  మంజూరు చేసింది.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కమల్‌ హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘స్వతంత్ర భారతంలో తొలి తీవ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే’ అని అన్నారు. కమల్‌ వ్యాఖ్యలపై హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యాఖ్యలపై వివిధ ప్రాంతాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. కమల్‌కు వ్యతిరేకంగా 76 ఫిర్యాదులు రాగా.. రెండు కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో కమల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని, తీవ్రవాదులు అన్ని మతాల్లో ఉన్నారని చెప్పే ఉద్దేశ్యంతోనే ఆ మాటలు వాడానని కమల్ కోర్టుకి విన్నవించారు. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను అంగీకరించింది.

కమల్‌ను అరెస్టు చేయకుండా కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఆయన మళ్ళీ వివరణ కూడా ఇచ్చారు. తీవ్రవాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారని అన్నారు. మొత్తం మీద కమల్ హాసన్ వ్యాఖ్యలపై విమర్శలు రాజుకుంటూనే ఉన్నాయి. రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడడం కమల్ ఎప్పుడు నేర్చుకుంటారోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle