హంపి, జంషెడ్పూర్లలో కలవరపెట్టిన భూప్రకంపనలు
05-06-202005-06-2020 10:15:50 IST
Updated On 05-06-2020 10:39:01 ISTUpdated On 05-06-20202020-06-05T04:45:50.653Z05-06-2020 2020-06-05T04:44:13.669Z - 2020-06-05T05:09:01.284Z - 05-06-2020

ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతమవుతోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో కరోనా బాధితుల మరణాల సంఖ్య 6 వేలు దాటిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. శుక్రవారం నాటికి రోజువారి కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 9851 కేసులు వెలుగుచూశాయి.మరణాల సంఖ్య 273గా నమోదయ్యాయి. గురువారం 9,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. అంటే గంటకు 390 మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా 260 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,26,770 గా నమోదయ్యాయి. మరణాల సంఖ్య 6348గా నమోదైంది. దీనికి తోడు నిసర్గ తుపాను సైతం ముంబయిని వణికించింది. ఈదురుగాలులతో ముంబై చుట్టుపక్కల తీవ్ర అలజడి రేగింది, చెట్లు నేలకూలాయి. తాజాగా భూప్రకంపనలు జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దేశంలో శుక్రవారం రెండు చోట్ల భూకంపాలు సంభవించాయి. జార్ఖండ్, మహారాష్ట్రలో భూ ప్రకంపనలు టెన్షన్ పెట్టాయి. ఇవాళ ఉదయం 6.55 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం నమోదు కాగా, కర్నాటకలోని చారిత్రక ప్రాంతం హంపిలో కూడా రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూమి కంపించిందని జాతీయ సెసిమాలజీ కేంద్రం పేర్కొంది. దీంతో రెండుప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు లేకపోయినా జనం ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. కర్నాటకలోని హంపిలో తక్కువ స్థాయిలోనే భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పురాతన నగరంలో ఏడవ శతాబ్ధానికి చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. యునెస్కో ఈ నగరాన్ని వారసత్వ సంపదకు చిహ్నంగా ప్రకటించింది. భూకంపం వల్ల చారిత్రక ఆలయాలకు ఏమైనా హాని జరిగిందేమోనని అంతా భావించారు. కానీ అలాంటిదేం లేదని అధికారులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం కూడా పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. హర్యానాలోని రోహతక్‌లో 4.6 తీవ్రతతో భూమి కంపించింది దేశరాజధాని ప్రాంతంలో మే నెలలో అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి ప్రకంపనలు నమోదు అయ్యాయి. వీటి వల్ల నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
4 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
an hour ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
11 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
11 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
12 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
14 hours ago
ఇంకా