newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్వచ్ఛ భారత్ సరే.. ఉద్యోగాలేవీ.. మోదీని ప్రశ్నించిన రాహుల్

11-08-202011-08-2020 16:09:11 IST
2020-08-11T10:39:11.681Z11-08-2020 2020-08-11T10:39:08.592Z - - 17-04-2021

స్వచ్ఛ భారత్ సరే.. ఉద్యోగాలేవీ.. మోదీని ప్రశ్నించిన రాహుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో పెరుగుతున్న తప్పుడు ప్రకటనల చెత్తను శుద్ధి చేయడానికి దేశపౌరులుగా మనందరం కలిసి రావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై విమర్శల పర్వం కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా స్వచ్ఛభారత్ అభియాన్‌ని స్వాతంత్ర్య దినోత్సవం వరకు వారం రోజులపాటు యావద్దేశం పాటించాలని మోదీ ఇచ్చిన పిలుపుపై రాహుల్ దాడి చేశారు. 

చైనా దాడికి సంబంధించిన వాస్తవాలను దేశం ముందు బయటపెట్టడం ద్వారా ప్రధాని తన సత్యాగ్రహను ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు. భారత్ సరిహద్దులపై చైనా దాడి గురించి ప్రపంచం కోడై కూస్తున్నా ప్రధాని వాస్తవం చెప్పకుండా మౌనం పాటిస్తున్నారెందుకు అంటూ రాహుల్ ప్రశ్నించారు.

భారత ఆర్థిక వ్యవస్థను పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, లాక్‌డౌన్‌ విధించడం అనే మూడు అంశాలే దెబ్బతీశాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ‘ఉపాధి కల్పించండి’ అనే నినాదంతో కాంగ్రెస్‌ యువజన విభాగం చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ధ్వజమెత్తారు. 

‘మోదీ ప్రధాని పదవి చేపట్టినపుడు ప్రతియేటా రెండో కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. స్వప్నాన్ని చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. ఎందుకిలా జరిగింది తప్పుడు విధానాలే కారణం. నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, లాక్‌డౌన్‌... ఈ మూడు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వాస్తవమేమిటంటే ఇప్పుడు భారత్‌ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోంది’ అని రాహుల్‌ ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో ధ్వజమెత్తారు. 

అందుకే యూత్‌ కాంగ్రెస్‌ వీధులకు ఎక్కిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరుద్యోగ సమస్యను యూత్‌ కాంగ్రెస్‌ లేవనెత్తడం సంతోషకరమన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్‌ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోజ్‌గార్‌ దో ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువశక్తే మన బలమన్నారు.   

కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలి.. శశిథరూర్‌

పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే ప్రక్రియకు కాంగ్రెస్‌ వేగవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ చుక్కాని లేని నావలా తయారైందని, సరైనా దిశానిర్దేశం కొరవడిందని వ్యతిరేక మీడియా కారణంగా ప్రజల్లో నెలకొంటున్న అభిప్రాయాన్ని అడ్డుకోవాలంటే.. వెంటనే అధ్యక్ష నియామకం జరగాలన్నారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టే సామర్థ్యం రాహుల్‌ గాంధీకి ఉందని తాను భావిస్తున్నానన్నారు.

ఒకవేళ రాహుల్‌ బాధ్యతలు స్వీకరించడానికి విముఖంగా ఉంటే... కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియను వెంటనే చేపట్టాలని శశిథరూర్‌ పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. 

తాత్కాలిక సారథిగా సోనియా గాంధీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టి ఈనెల పదో తేదీతో ఏడాది అవుతుంది. సోనియా నిరవధికంగా ఈ బాధ్యతలు మోయాలనుకోవడం న్యాయం కాదని శశిథరూర్‌ అన్నారు. గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ వ్యవహరించలేకపోతోందని, సవాళ్లను స్వీకరించడం లేదనే ప్రచారానికి తెరపడాలన్నారు. 

రాహుల్‌ విముఖంగా ఉంటే... కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఉత్తేజం నింపొచ్చని అభిప్రాయపడ్డారు.  

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   6 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle